John Abraham Attack : బాలీవుడ్ సౌత్ సినిమాల తాకిడికి నలిగిపోతోంది. కేజీఎఫ్ మొదలు నిన్నటి ఆర్ఆర్ఆర్ వరకు బాలీవుడ్ కు కంటిమీద కుంకుమ లేకుండా చేసాయి. సౌత్ సినిమాలకు నార్త్ లో విపరీతమైన క్రేజ్ పెరగడం, బాలీవుడ్ ఇంకా మూస చిత్రాలను వదలకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.
ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 న విడుదలయి రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ లో మంచి కలెక్షన్లతో రచ్చ చేస్తోంది. ఇక నేపాల్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికాల్లో కూడా ఆర్ఆర్ఆర్ దుమ్ములేపుతోంది.ఇక బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ దెబ్బకు మిగతా సినిమాల కలెక్షన్లు తగ్గిపోయాయి.
ఎటాక్ కు హార్ట్ ఎటాక్….
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన వారం తర్వాత థియేటర్లలో ఎటాక్ మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం నటించిన ఎటాక్ తొలిరోజు కలెక్షన్లు ఆయన అభిమానులను సైతం షాక్ కు గురి చేస్తున్నాయి. విడుదలైన రోజు 3 కోట్లు వసూలు చేసిందట జాన్ అబ్రహం ఎటాక్ మూవీ.హిందీలో ఎటాక్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తుంటే ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లు మాత్రం ఫుల్ అవుతున్నాయి.
ప్రాంతీయ భాషా చిత్రాల్లో చేయనన్న జాన్ ….
ఇటీవలే జాన్ అబ్రహం సౌత్ సినిమాలను చిన్నచూపు చూస్తూ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఇపుడు ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఆ సినిమా కలెక్షన్స్ ఘోరంగా పడిపోవడం తో ఎటాక్ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…