Teja Sajja: టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో నటుడు తేజ సజ్జ ఒకరు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తేజ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. జనవరి 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంతో హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.
తేజ సజ్జ ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నిర్మాతలు తనని కలిసి అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. ఇక ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పకుండా సెలబ్రిటీలు రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు అలాంటిది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తేజ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచారని తెలుస్తుంది.
నాలుగు కోట్లు పెంచిన తేజ..
హనుమన్ సినిమా కోసం కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఈయన ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక హిట్ సినిమాతో ఈయన ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారు ఇలా రెమ్యునరేషన్ పెంచినప్పటికి నిర్మాతలు వెనకడుగు వేయకుండా ఆయన అడిగినది మొత్తం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…