ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కోసం ట్యాబ్లెట్లు..?

కరోనా, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలతో పోల్చి చూస్తే విద్యారంగంపై అధికంగా పడింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విజృంభణ వల్ల స్కూళ్లను తెరవడంపై ఆంక్షలు విధించడంతో ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయి. అయితే చాలామంది పిల్లలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు లేక చదువుకు దూరమవుతున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాల పిల్లలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా హర్యానా ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 8 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితం ట్యాబ్లెట్లను ఇవ్వనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్‌ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలో డిసెంబర్ 10వ తేదీన స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

మొదట హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న స్కూళ్లు ఓపెనింగ్ చేయాలని భావిస్తోంది. అయితే మొదట్లో నవంబర్ 30నే స్కూళ్లను ఓపెన్ చేయాలని అనుకున్నా రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు దూరం కాకూడదని భావించి ప్రభుత్వం ట్యాబ్లెట్ల పంపిణీ చేపడుతోంది.

విద్యార్థులకు ట్యాబ్లెట్లు పంపిణీ చేయడం ద్వారా విద్యార్థులకు విద్యకు దూరం కారని.. యాక్టివ్ గా క్లాసుల్లో పాల్గొంటారని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరిచే విషయంలో హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలను అనుసరించనుందని తెలుస్తోంది.