Heavy rains in Hyderabad disrupt public life
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో, గురువారం హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ భారీ వర్షాల కారణంగా నగర జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అతలాకుతలమైన నగర జీవనం
గంటల వ్యవధిలోనే కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి వీధులన్నీ వరదనీటితో నిండిపోయాయి. కృష్ణా నగర్లో వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాలైన అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, కృష్ణా నగర్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దాదాపు 200 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్ల పక్కన పార్క్ చేసిన దాదాపు 500 బైకులు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్లు కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి.
రికార్డు స్థాయిలో వర్షపాతం, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
గచ్చిబౌలిలో 14 సెంటీమీటర్లు, సరూర్‌నగర్‌లో 13 సెంటీమీటర్లు, నగరవ్యాప్తంగా సగటున 12.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేయడంతో, దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరో మూడు రోజులు వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఈరోజు (శుక్రవారం) కూడా హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…