Hero Siddharth : బొమ్మరిల్లు సినిమాకు 12 నంది అవార్డులు వస్తే… కనీసం నాకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు…: హీరో సిద్ధార్థ్

Hero Siddharth : బాయ్స్ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సిద్ధార్థ ఆ తరువాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సిద్ధార్థ అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే చుక్కల్లో చంద్రుడు వంటి డిజాస్టర్ తరువాత సిద్ధార్థ జోరు తెలుగులో తగ్గింది. ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన సిద్ధు, ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

నా సినిమాలకు అవార్డులు వచ్చినా…

సిద్ధార్థ్ తమిళ హీరో అయినా తెలుగులో స్ట్రైట్ సినిమాలను తీసి హిట్టు కొట్టాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస హిట్లను కొట్టిన సిద్ధార్థ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమాల గురించి మాట్లాడారు. అవార్డులను తానెపుడూ ఆశించలేదని చెప్తూనే నంది అవార్డు తనకు రాలేదని చెప్పారు.

నువ్వొస్తానంటే నేనొద్ధంటానా, బొమ్మరిల్లు సినిమాలకు చాలా నంది అవార్డులు వచ్చినా నాకు హీరోగా రాలేదు. కనీసం నాకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. దాని కోసం నేను బాధపడుతూ కూర్చోలేను కదా అంటూ చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకుని కనిపించినపుడు అడిగితే చాలా ఆనందంగా ఉంటుంది అంటూ చెప్పారు.