Hero Siddharth : బాయ్స్ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సిద్ధార్థ ఆ తరువాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సిద్ధార్థ అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే చుక్కల్లో చంద్రుడు వంటి డిజాస్టర్ తరువాత సిద్ధార్థ జోరు తెలుగులో తగ్గింది. ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన సిద్ధు, ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
నా సినిమాలకు అవార్డులు వచ్చినా…
సిద్ధార్థ్ తమిళ హీరో అయినా తెలుగులో స్ట్రైట్ సినిమాలను తీసి హిట్టు కొట్టాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస హిట్లను కొట్టిన సిద్ధార్థ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమాల గురించి మాట్లాడారు. అవార్డులను తానెపుడూ ఆశించలేదని చెప్తూనే నంది అవార్డు తనకు రాలేదని చెప్పారు.
నువ్వొస్తానంటే నేనొద్ధంటానా, బొమ్మరిల్లు సినిమాలకు చాలా నంది అవార్డులు వచ్చినా నాకు హీరోగా రాలేదు. కనీసం నాకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. దాని కోసం నేను బాధపడుతూ కూర్చోలేను కదా అంటూ చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకుని కనిపించినపుడు అడిగితే చాలా ఆనందంగా ఉంటుంది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…