భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య రెండు లక్షలు దాటడంతో ఇతర దేశాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి తమ దేశానికి విమానాల రాకపోకలను హంకాంగ్ ప్రభుత్వం నిషేధించింది.ఇటీవల కాలంలో న్యూజిలాండ్ ప్రభుత్వం భారత ప్రయాణికులపై నిషేధం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా హంకాంగ్ ప్రభుత్వం భారత విమానాలకు నిషేధం తెలిపింది.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, ఫిలిపిన్స్ దేశాలలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ మూడు దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను హాంకాంగ్ ప్రభుత్వం ఈనెల 20 నుంచి 14 రోజుల పాటు నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.గతవారం ఎన్501వై రకం కోవిడ్ స్ట్రెయిన్‌ను హాంకాంగ్‌లో తొలిసారి గుర్తించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
ఆదివారం హాంకాంగ్ లో 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 29 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులుగా గుర్తించడం గమనార్హం. మార్చి 15వ తేదీ నుంచి హాంకాంగ్ లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు11,600 కేసులు నమోదు కాగా అందులో 209 మంది ప్రాణాలను కోల్పోయారు.
ఈ విధంగా హాంకాంగ్ లో కేసుల సంఖ్య పెరగడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి విమానాల రాకపోకలను 14 రోజులపాటు నిలిపివేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంది.7.5 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది శాతం మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…