భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య రెండు లక్షలు దాటడంతో ఇతర దేశాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి తమ దేశానికి విమానాల రాకపోకలను హంకాంగ్ ప్రభుత్వం నిషేధించింది.ఇటీవల కాలంలో న్యూజిలాండ్ ప్రభుత్వం భారత ప్రయాణికులపై నిషేధం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా హంకాంగ్ ప్రభుత్వం భారత విమానాలకు నిషేధం తెలిపింది.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, ఫిలిపిన్స్ దేశాలలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ మూడు దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను హాంకాంగ్ ప్రభుత్వం ఈనెల 20 నుంచి 14 రోజుల పాటు నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.గతవారం ఎన్501వై రకం కోవిడ్ స్ట్రెయిన్‌ను హాంకాంగ్‌లో తొలిసారి గుర్తించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

ఆదివారం హాంకాంగ్ లో 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 29 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులుగా గుర్తించడం గమనార్హం. మార్చి 15వ తేదీ నుంచి హాంకాంగ్ లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు11,600 కేసులు నమోదు కాగా అందులో 209 మంది ప్రాణాలను కోల్పోయారు.

ఈ విధంగా హాంకాంగ్ లో కేసుల సంఖ్య పెరగడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి విమానాల రాకపోకలను 14 రోజులపాటు నిలిపివేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంది.7.5 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది శాతం మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here