జగన్ క్రిస్టియన్ అని ఎలా చెబుతున్నారు.. ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడం గురించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సుధాకర్ బాబు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలు పాటించని పక్షంలో ఏ అధికారంతో సీఎం జగన్ మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని కోవారెంటో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ గురించి విభేదించడంతో పాటు ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ తరఫు లాయర్ హిందువులకు మాత్రమే తిరుమలలో ప్రవేశం ఉంటుందని.. దేవాదాయశాఖ చట్ట నిబంధన 136, 137 ప్రకారం అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలని ఉందని చెప్పారు.

సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 97, 153లకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జడ్జి లాయర్ ను సీఎం జగన్ క్రిస్టియన్ అని చెప్పేందుకు ఆధారాలు చూపించాలని ప్రశ్నించింది. సరైన ఆధారాలు చూపకుండా సీఎం మతం గురించి వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు సీఎంను కులం గురించి అడగదని.. వ్యాజ్యం దాఖలు చేసిన వాళ్కే ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది.

జగన్ క్రిస్టియన్ అని ప్రూవ్ చేసేందుకు గడువు ఇస్తామని పూర్తి వివరాలు లేకుండా పిటిషన్ విచారణ ముందుకు వెళ్లదని చెబుతూ హైకోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.