Featured

సెంచరీకి చేరువలో రన్అవుట్ అయిన దర్శకుడు ఎవరో తెలుసా.?!

ఆయన ఓ సినీ కళా కార్మికుడు, తన లక్ష్య సాధనలో నిర్విరామ మేధోమదనం తో విజయాలను తను అందుకోవడమే కాక సినీ నటులను విజయ శిఖరాలను అంచులకు తీసుకువెళ్లి తాను తీసిన చిత్రాలలో 90% విజయవంతమైన చిత్రాలను రూపొందించి, సినీ దర్శకునిగా మకుటం లేని మహారాజుగా ఎదిగారు. ఒక్క ఎన్.టి. రామారావు మినహా ఆ తరం నుంచి ఈ తరం వరకూ అందరితో సినిమాలు తీశాడు.

నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి హీరోలతో హిట్టు, సూపర్ హిట్ లను తీసిన అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి. అక్కినేని నాగేశ్వరరావు-శ్రీదేవి లతో శ్రీరంగనీతులు…శ్రీరంగనీతులు సినిమా షూటింగ్ లో సంబంధించిన నటుడు రాకపోవడం మూలాన కోదండరామిరెడ్డి ఓ చిన్న పాత్రను వేయడం జరిగింది. రాధిక ఏ.ఎన్నార్ తో అనుబంధం సినిమా, కృష్ణం రాజు-జయప్రదల తో ప్రళయ రుద్రుడు, కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్ లో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఆ తర్వాత శోభన్ బాబు-లక్ష్మీ కాంబినేషన్లో ప్రేమ మూర్తులు అలాగే శోభన్ బాబు-సుహాసిని కాంబినేషన్ లో బావ మరదలు, ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాలను రూపొందించారు.

ఆ తర్వాత తరం హీరోలయిన చిరంజీవితో అనేక సినిమాలను రూపొందించారు. ఒక విధంగా చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఖైదీ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. చిరంజీవి రాధిక కాంబినేషన్లో న్యాయం కావాలి, అభిలాష, దొంగ మొగుడు, చిరంజీవి -విజయశాంతి కాంబినేషన్లో చాలెంజ్, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, చిరంజీవి-సుహాసిని కాంబినేషన్ లో రాక్షసుడు, బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ లో భానుమతి గారి అల్లుడు, భార్గవ రాముడు, భలే దొంగ.

నాగార్జున-జుహీచావ్లా కాంబినేషన్లో విక్కీ దాదా, నాగార్జున-మీనా కాంబినేషన్ లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, బొబ్బిలి సింహం,వెంకటేష్-విజయశాంతి కాంబినేషన్ లో సూర్య ఐపిఎస్ మోహన్ బాబు-దివ్యభారతి కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు, రాజశేఖర్ తో రౌడీయిజం నశించాలి మొరటోడు నా మొగుడు వంటి దాదాపు 93 సినిమాలను ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించి హీరోల సక్సెస్ రేటును పెంచిన ఈ దర్శకుడు సెంచరీకి చేరువలో రనౌట్ అయ్యారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago