ఆయన ఓ సినీ కళా కార్మికుడు, తన లక్ష్య సాధనలో నిర్విరామ మేధోమదనం తో విజయాలను తను అందుకోవడమే కాక సినీ నటులను విజయ శిఖరాలను అంచులకు తీసుకువెళ్లి తాను తీసిన చిత్రాలలో 90% విజయవంతమైన చిత్రాలను రూపొందించి, సినీ దర్శకునిగా మకుటం లేని మహారాజుగా ఎదిగారు. ఒక్క ఎన్.టి. రామారావు మినహా ఆ తరం నుంచి ఈ తరం వరకూ అందరితో సినిమాలు తీశాడు.

నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి హీరోలతో హిట్టు, సూపర్ హిట్ లను తీసిన అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి. అక్కినేని నాగేశ్వరరావు-శ్రీదేవి లతో శ్రీరంగనీతులు…శ్రీరంగనీతులు సినిమా షూటింగ్ లో సంబంధించిన నటుడు రాకపోవడం మూలాన కోదండరామిరెడ్డి ఓ చిన్న పాత్రను వేయడం జరిగింది. రాధిక ఏ.ఎన్నార్ తో అనుబంధం సినిమా, కృష్ణం రాజు-జయప్రదల తో ప్రళయ రుద్రుడు, కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్ లో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఆ తర్వాత శోభన్ బాబు-లక్ష్మీ కాంబినేషన్లో ప్రేమ మూర్తులు అలాగే శోభన్ బాబు-సుహాసిని కాంబినేషన్ లో బావ మరదలు, ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాలను రూపొందించారు.

ఆ తర్వాత తరం హీరోలయిన చిరంజీవితో అనేక సినిమాలను రూపొందించారు. ఒక విధంగా చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఖైదీ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. చిరంజీవి రాధిక కాంబినేషన్లో న్యాయం కావాలి, అభిలాష, దొంగ మొగుడు, చిరంజీవి -విజయశాంతి కాంబినేషన్లో చాలెంజ్, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, చిరంజీవి-సుహాసిని కాంబినేషన్ లో రాక్షసుడు, బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ లో భానుమతి గారి అల్లుడు, భార్గవ రాముడు, భలే దొంగ.

నాగార్జున-జుహీచావ్లా కాంబినేషన్లో విక్కీ దాదా, నాగార్జున-మీనా కాంబినేషన్ లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, బొబ్బిలి సింహం,వెంకటేష్-విజయశాంతి కాంబినేషన్ లో సూర్య ఐపిఎస్ మోహన్ బాబు-దివ్యభారతి కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు, రాజశేఖర్ తో రౌడీయిజం నశించాలి మొరటోడు నా మొగుడు వంటి దాదాపు 93 సినిమాలను ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించి హీరోల సక్సెస్ రేటును పెంచిన ఈ దర్శకుడు సెంచరీకి చేరువలో డకౌట్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here