తెలంగాణకు సాయం చేస్తున్న సీఎం జగన్.. ఏం జరిగిందంటే..?

గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలో పరిస్థితి అదుపు వచ్చిందనుకునే లోపు నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని ప్రధాన ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. వాతావరణశాఖ మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ప్రజలను హెచ్చరిస్తోంది.

వర్షాలు, వరదల వల్ల కొందరి ఇళ్లు పాక్షికంగా దెబ్బ తినగా మరి కొందరి ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ సాయం కోరారు. జగన్ కేసీఆర్ మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ జల వివాదం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తెలంగాణ ప్రజలు వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ సహాయం చేయడానికి అంగీకరించారు.

సీఎం కేసీఆర్ నగరంలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం స్పీడ్ బోట్స్ అవసరమని అధికారులతో సమ్జీక్ష అనంతరం జగన్ ను కోరగా జగన్ స్పీడ్ బోట్స్ ను పంపించడానికి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది. సీఎం జగన్ సహాయం చేయడానికి ముందుకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్, సీఎం కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉంటే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏపీ తెలంగాణ రాష్ట్రాల బస్ సర్వీసులు దసరా పండుగకు లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.