గాల్లో ప్రయాణం చేయాలని ఎంతో మందికి ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే ప్రస్తుతం గాలిలో ప్రయాణం చేయాలంటే విమాన ప్రయాణం ఒకటే మార్గం. విమానంలో ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు కనుక ఆ కల కలగానే మిగిలిపోతుంది.అయితే ఈ విధంగా గాలిలో ప్రయాణించాలని కోరిక త్వరలోనే తీరబోతోంది అని ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందయ్ సీఈఓ కీలక ప్రకటనలు చేశారు.
కార్లు గాలిలో ఎగిరే సన్నివేశాలు మనం కేవలం హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే చూస్తుంటాము. అయితే నిజంగానే కార్లు గాలిలో ఎగురుతూ ఎలా ఉంటుంది.. ఊహించడానికి ఎంతో ఆనందంగా ఉంది కదూ. అయితే ఈ ఊహను త్వరలోనే నిజం చేయనున్నారు.ఇప్పటికే యూరప్‌కు చెందిన ఓ కంపెనీ ఎగిరే కారును తయారు చేసి విజయంతంగా ట్రైల్ రన్ నిర్వహించింది. ఎగిరే కార్లకు సంబంధించి తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందయ్ కంపెనీ కూడా కీలక ప్రకటన చేసింది.
గాలిలో ప్రయాణించే కార్లను చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రాబోయే అతి తక్కువ రోజులలో ఈ విధంగా గాలిలో ఎగిరే కార్లను చూస్తామని ఈ సందర్భంగా మైఖేల్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలకు అర్బన్ నగరాలలో ఎయిర్ కారు ట్రాన్స్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ విధంగా ఎయిర్ కార్లు అందుబాటులోకి వస్తే పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ సమస్యలతో పాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
అలాగే ఎంతో సుదూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.ఫ్లైయింగ్ కార్లకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని, హ్యూందాయ్ సీఈఓ మైఖేల్ కోల్ పేర్కొన్నారు.
యూరప్‌లో ఇప్పటికే క్లెన్ విజన్ అనే సంస్థ ఎయిర్ కారును అభివృద్ధి చేసింది. నాలుగు రోజుల క్రితం స్లోవేకియాలో తొలి టెస్ట్ రన్ చేసి విజయంతమయ్యారు. నిట్రా ఎయిర్‌పోర్టు నుంచి బ్రిటిస్లావా ఎయిర్‌పోర్టుకు దాదాపు 35 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించింది. గంటకు 170 కిలో మీటర్ల వేగంతో కారులో ఇద్దరు కూర్చొని సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…