ముత్యాల సుబ్బయ్య. పరిచయం అక్కర్లేని తెలుగు సినిమా దర్శకుడు. ఫ్యామిలీ కథ డైరెక్టర్ గా మంచి పేరు పొందాడు. సుమారు 50 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు. అందుకులో ఏవో కొన్ని సినిమాలు తప్ప.. అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈయన సినిమాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. సుబ్బయ్యకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముత్యాల సుబ్బయ్య నిర్మాత హరికృష్ణ కొన్ని సినిమాలు తీశారు. ముందుగా తెరకెక్కించిన మూడు సినిమాలకు మాత్రం అంతంగానే రెమ్యునరేషన్ ఇచ్చారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమాగా మమతల కోవెల తెరకెక్కింది. రాజశేఖర్, సుహాసిని హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే నాలుగో సినిమాకు కూడా పారితోషికం అడగలేకపోయాడు సుబ్బయ్య. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. పూర్తయ్యింది. సినిమా మంచి విజయం సాధించింది. వందరోజుల వేడుకు సినిమా యూనిట్ రెడీ అయ్యింది.
అయినా దర్శకుడికి డబ్బులు ఇవ్వలేదు. సరికదా.. వంద రోజుల వేడుకకు రావాలని ఫోన్ చేశారు. కానీ తనకు డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఫంక్షన్ కు తాను రావాలంటే తననకు ఇవ్వాల్సిన పారితోషకం ఇవ్వాలన్నాడు. లేదంటే తాను రాబోనని తేల్చి చెప్పాడు. అయితే యూనిట్ సభ్యుడు చిన్నబ్బాయ్.. డబ్బులి ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. వేడుక బాగా జరిగింది. కానీ తనకు ఇవాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఇంత కష్టపడి సినిమా తీసినా.. డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని తనలో తాను మదన పడ్డాడు సుబ్బయ్య.
మమతల కోవెల చిత్రం తర్వాత జయసింహ సినిమా చేశాడు సుబ్బయ్య. చెన్నై సవేరా హోటల్స్ అధినేత ఎ.వి.కె. రెడ్డి ఆ సినిమాకు నిర్మాతగా చేశాడు. ఆయన వాళ్లు అంతకుముందు విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రుతి లయలు సినిమా చేసినా మంచి విజయం సాధించలేదు. దీంతో యాక్షన్ సినిమా తీయాలని భావించారు. ఈ సినిమా కోసం సుమన్ డేట్స్ తీసుకున్నారు. అయితే తాను యాక్షన్ సినిమాలు తీయలేనని చెప్పాడు. అయినా తప్పదని వారు కోరారు. సుమన్ ఇచ్చిన డేట్స్ దగ్గరకు రావడంతో గొల్లపూడి మారుతీ రావు దగ్గరకు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సబ్జెక్ట్ డిస్కషన్స్ లో ఆయన సాయం చేశాడు. తను ఓ స్టోరీ లైన చెప్పాడు. అది అందరికీ నచ్చింది. ఆ సినిమాకు జయసింహ అని పేరు పెట్టారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…