తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ ఆసరా పెన్షన్ కింద 2116 రూపాయలను అందిస్తున్నారు. ఇకపై ఈ పెన్షన్ 57 సంవత్సరాలు ఉన్న వారందరికీ కూడా వర్తిస్తుందని ఆదివారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
గత ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు ఉన్న వారందరికీ వచ్చే నెల నుంచి ఆసరా పెన్షన్ అందనుంది. ఈ పెన్షన్ పొందడానికి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా కింద 2116 లను అందించనున్నారు. ఓటర్ కార్డ్ పై ఉన్న పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని పెన్షన్ అందించనున్నారు. ఈ క్రమంలోనే ఈ పెన్షన్ కు దరఖాస్తు చేసుకొని అభ్యర్థికి మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాని 3ఎకరాలకు మించి ఉండకూడదు.
అదేవిధంగా గ్రామాలలో వార్షిక ఆదాయం 1.5 లక్షలు పట్టణాలలో రెండు లక్షలకు మించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, వ్యాపారంలో అధిక లాభం పొందే వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే డాక్టర్లు,కాంట్రాక్టర్లు వంటి అధిక ఆదాయం కలిగి ఉండి వారి సంతానం పై ఆధారపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఈ పథకం వర్తించదు. ఎవరి పేరుమీద నైతే హెవీ వెహికల్స్ ఉంటాయో అలాంటి వారు కూడా అనర్హులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వితంతువులు 60 సంవత్సరాలు పైబడిన వారు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వంటి వారికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద 2,116 రూపాయలను అందిస్తోంది. దివ్యాంగులకు 3,116 రూపాయలను అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…