రైలు కూత మొదలైంది. ఈరోజు నుంచి 15 ప్రధాన నగరాలకు రైళ్లు నడుపుతుంది రైళ్ల శాఖ. ఇందుకోసం 30 సర్వీసులను నడుపుతోంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రతి కోచ్ లో 72 మంది ప్రయాణికులు మించకుండదు జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, దిబ్రూగఢ్, అగర్తలా, రాంచీ, భువనేశ్వర్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతుంది రైల్వే శాఖ. ఈ నేపథ్యంలో ట్రైన్ చార్జీలు, బయలుదేరే వేళలు, ప్రయాణించే వేళలు అన్ని రాజధాని రైళ్ల నియమాలు వర్తిస్తాయని తెలిపింది. ఏసీ అవసరమైనంత ఉష్ణోగ్రతలో మాత్రమే నడుస్తుందని స్పష్టం చేసింది. మరో వైపు ఏసీ కోచ్ లలో దుప్పట్లు, బెడ్ షీట్లు ఇవ్వబోమని తెలిపింది.
కాగా, తెలుగు రాష్ట్రాలలో ఆగే రైళ్లు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్లే రైలు ఆంద్రప్రదేశ్ లోని గుంతకల్ జంక్షన్, అనంతపురం స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఇక అదే రైలు తెలంగాణలో సికింద్రాబాద్ లో మాత్రమే ఆగుతుంది. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు ఉంది. కానీ ఇది కేవలం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మాత్రమే ఆగుతుందని స్పష్టం చేసింది. కాగా, రేపు నడుపనున్న ఢిల్లీ – చెన్నై రైలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వేస్టేషన్ లో ఆగుతుంది. అదే రైలు తెలంగాణాలో వరంగల్ రైల్వే స్టేషన్ లో మాత్రమే ఆగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…