ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్…తాజగా తీవ్రమైన జలుబుతో బాధపడుతూ కనిపించారు. నిన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో అయన జలుబు, తుమ్ములతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం ఇదే ఆయనపై విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే… సోమవారం అయన సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్స్ పార్క్‌లో పలు అభివృద్ది పనులను పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్, పరిపాలన భవనం, కార్మికుల భోజశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన అయన నాలుగైదు చోట్ల జలుబుతో తుమ్ముతు కనిపించారు.
అదే సమయంలో ఎప్పుడు చేతిరుమాలు కూడా దగ్గర ఉంచుకొని మంత్రి ఈసారి మాత్రం గులాబీ రంగు రుమాలు మాత్రం భుజాన వేసుకుని తిరిగారు. అయితే మంత్రి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు భయంతో కాస్త దూరం జరుగుతూ కనిపించారు. దీనికి సంబంధిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో జలుబుతో బాధపడుతున్న మంత్రి ఇలా బయట తిరగడంపై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…