తెలుగు ఇండస్ట్రీలో సినీ తారలకు చాలా క్రేజ్ ఉంటుంది. అంతేకాకుండా సినిమాలలో వారు హిట్ కొడితే ఆ తర్వాత భారీ స్థాయిలో వారు డబ్బులు సంపాదిస్తారు. ఇక అదే స్థాయిలోనే వారి ఖర్చులు కూడా వారికి ఉంటాయి. లగ్జరీ కారు, ఇల్లు, వాళ్ల ఇళ్లల్లో పనిచేసే పనులు.. ఇలా చాలా రకాలుగా వారి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. ఇలాంటివి కొంతమందికి లక్షల్లో ఉంటే మరి కొంత మందికి కోట్లలో ఉంటుంది. చాలా మంది సినీ తారలు సినిమాలలో ఒక వెలుగు వెలిగి బాగా సంపాందించిన వారే. మరి కొందరు తారలు అయితే పేరు సొంతం చేసుకున్న డబ్బు మొత్తం పూర్తిగా అయిపోయి మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది గత తరం వారి సినీ తారలలో ఎక్కువగా కనపడుతుంది.
కానీ ప్రస్తుత తారలు మాత్రం ఎప్పుడు లగ్జరీ జీవితాన్ని కొనసాగించాలని.. సినిమాలతో పాటు వారు సైడ్ బిజినెస్ లు కూడా మొదలు పెడుతున్నారు. ప్రస్తుత హీరోలు, హీరోయిన్లకు వారు లగ్జరీగా జీవించాలి అంటే వారు ఏమి చేయాలో బాగా తెలుసు. అందుకోసమే సినీ తారలు లాభాలు ఎక్కువగా సంపాదించే బిజినెస్ ను ఎంచుకొని మొదలు పెడుతున్నారు.
ఇకపోతే ప్రస్తుత సినీతారలు ఏ బిజినెస్ లో ఎంచుకున్నారో ఒకసారి చూద్దాం… ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో తెలుసుకోవాల్సింది మెగాస్టార్ చిరు.. చిరుకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. సినీ నిర్మాణ సంస్థ కూడా ఉంది. చిరు తన తోటి నటుడు నాగార్జున, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి క్రీడారంగ ఫ్రాంచైజీ వ్యాపారంలో కొనసాగుతున్నాడు. ఇటీవల చిరు కేరళ ఫుట్ బాల్ జట్టును కూడా కొనుగోలు చేశాడు.
కాజల్ అగర్వాల్ జ్యువెలరీ బిజినెస్ మొదలుపెట్టారు. కాజల్ అగర్వాల్, చెల్లెలు నిధి అగర్వాల్ తో కలిసి మార్షల్ జూలరీ షాప్ ప్రారంభం చేసింది. ఇక అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నగలను ఆన్లైన్ లో అమ్ముతున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్, ప్రధాన నగరాలలో తమ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఈయన మంచి వ్యాపారవేత్త కూడా. ఈ మనకు స్వతహాగా సినీ నిర్మాణ సంస్థ కూడా ఉంది. మహేష్ బాబు ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థతో పాటు ఏఎంబి సినిమాస్ అనే పేరుతో కూడా మల్టీప్లెక్స్ మొదలుపెట్టారు.
ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్స్ లో పెట్టుబడులు పెడుతుంది. ఇప్పటికే హైదరాబాదు గచ్చిబౌలిలో ఈమె ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది.. ఇక అక్కినేని నాగార్జున విషయానికి వస్తే మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. నాగార్జునకు “ఎన్ గ్రిల్” పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అనేక రంగాలలో సంపాదనలు పొందుతున్నారు. వీరు మాత్రమే కాదు మహేష్ బాబు “ఏఎంబీ సినిమాస్”, రామ్ చరణ్ (ట్రుజేట్ విమానాలు), అల్లు అర్జున్ (నైట్ క్లబ్స్) , మంచు విష్ణు, జగపతి బాబు, తమన్నా మరి కొంతమంది స్టార్స్ కూడా పలు వ్యాపారాలు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…