Featured

భారతదేశంలో మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రం మన తెలుగులోనే వచ్చిందని తెలుసా.?!

ఓ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సుమన్, భానుచందర్ ఇద్దరు కాస్త విరామం దొరకడంతో.. మధ్యాహ్నం యూనిట్ సభ్యులు లంచ్ ఏర్పాటు చేశారు. టేబుల్ పై భోజనం చేస్తున్న సుమన్ ని కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తున్న భానుచందర్ ను ఏమిటి అలా చూస్తున్నారని సుమన్ ప్రశ్నించాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుగు సినిమాల్లో ఎందుకు నటించకూడదని సుమన్ ను భానుచందర్ ఆతృతగా అడిగాడు. నాకు తెలుగు భాషలో ఓనమాలు కూడా రావు అలాంటిది తెలుగు సినిమాలలో నటించగలనా అని సుమన్ నెమ్మదిగా బదులిచ్చాడు.

నువ్వు తెలుగులో నటించు కేవలం మూడు నెలల్లో తెలుగు చాలా చక్కగా మాట్లాడుతావు. పైగా మాకు తెలుగు నేర్పించేంతగా భాషాపటిమ నీకు వస్తుందని సుమన్ తో భానుచందర్ చెప్పారు. అలా అన్నదే తడవుగా సుమన్ ని వెంటపెట్టుకొని తెలుగు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలిసి సుమన్ ని తెలుగులో పరిచయం చేయాలని భానుచందర్ ఆయనను కోరారు. ఆ విషయం పట్ల స్పందించిన నిర్మాత భరద్వాజ్ సుమన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. తమిళ సినిమా చేస్తున్న క్రమంలో ఒకరినొకరు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా పరిచయం చేసుకుని అందులోని పోరాట సన్నివేశాలను వారిద్దరు చక్కగా చేశారు. భారతదేశంలో ఇంతవరకూ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా ఒక్క సినిమా కూడా రాలేదు. కావున ఇద్దరు హీరోలు, నాలుగు పాటలు, ఎనిమిది ఫైట్లతో ఒక కథ సిద్ధం చేయండని నిర్మాత భరద్వాజ్ కు భాన్ చందర్ సలహా ఇచ్చారు.

ఆ క్రమంలో అప్పటి అప్ కమింగ్ రైటర్ భరత్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మంచి కథ తయారు చేశారు. ఆ కథకి అనుగుణంగా రచయిత కాశీ విశ్వనాథ్ సంభాషణలు అందించారు. కథ మాటలు చక్కగా కుదరడంతో ఈ సినిమాకి దర్శకునిగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా ఎదుగుతున్న రేలంగి నరసింహారావు ని తీసుకున్నారు. 1983 చరితచిత్ర బ్యానర్, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో సుమన్, భానుచందర్, సాధన హీరో, హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలో జయసుధ కనిపించారు. సుమన్, భాన్ చందర్ తెలుగులో నటించిన “ఇద్దరు కిలాడీలు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా చూసిన ఆనాటి తెలుగు యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆసక్తి కనబరచడం ఓ విశేషం. సుమన్, భానుచందర్ ఇద్దరూ ఈ చిత్రం తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో నటించారు.

కేవలం, మహా అయితే పది సంవత్సరాలు తెలుగు సినిమాల్లో నెట్టుకోస్తాం అని అనుకున్నా సుమన్ దాదాపు 40 సంవత్సరాలు గడిచిన కూడా ఇంకా తెలుగు సినిమాలలో సుమన్ నటించడం గమనించ దగిన విషయం. ఆయన నటుడిగా ఇద్దరు కిలాడీలు, తరంగిణి, నేటిభారతం, మెరుపుదాడి, 20వ శతాబ్దం, చిన్న అల్లుడు, పెద్దింటల్లుడు, బావ బావమర్ది, మొండి మొగుడు పెంకి పెళ్ళాం లాంటి చిత్రాలు సుమన్ కి పేరును తీసుకురాగా.. మన ఊరి పాండవులు, ఏది న్యాయం, ఏది ధర్మం, నిరీక్షణ, ముక్కుపుడక, ఇద్దరి కిలాడీలు, మెరుపుదాడి, లాయర్ సుహాసిని, నేటిదౌర్జన్యం, అలజడి, అశ్విని, సూత్రదారులు, సింధూరం లాంటి చిత్రాలు భానుచందర్ కి మంచి పేరును తీసుకువచ్చాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago