Featured

Chiranjeevi : జాతీయ అవార్డ్ దక్కిన రుద్రవీణ, ఆపద్భాంధవుడు చిత్రాలు చిరు ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో అందుకే చేరాయా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్స్‌తో పాటు డిజాస్టర్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. అన్నయ్య అంటూ మెగా అభిమానులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటున్న చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ నుంచి వచ్చే సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. అయితే కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి కూడా అంచనాలను తారుమారు చేసి అభిమానులనే కాదు మెగాస్టార్‌ను కూడా తీవ్రంగా నిరాశపరిచిన సినిమాలు చాలా ఉన్నాయి.

అలాంటి సినిమాలలో రుద్రవీణ, ఆపద్భాంధవుడు వంటి సినిమాలుండటం కాస్త షాకింగ్ విషయం. మంచి కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి కొన్ని ప్రయోగాత్మక సినిమాలను చేశారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి అనే సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో చిరంజీవి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటూ పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ సూపర్ ఫాంలో ఉన్నారు. అలాంటి సమయంలో ఏ హీరో తన ఇమేజ్‌కి దూరంగా వెళ్ళి సినిమా చేయలంటే ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పేస్తారు.

కానీ ఇక్కడ ఉంది మెగాస్టార్. ప్రయోగాలు చేస్తేనే తన స్థాయి ఇంకా పెరుగుతుంది. పైగా కళాతపస్వి కె విశ్వనాథ్ గారి లాంటి దర్శకుడితో అవకాశం అంటే ఇమేజ్ గురించి ఆలోచించే హీరో ఎవరూ ఉండరు. ఫ్లాప్ అయినా లెజండరీ దర్శకుడితో పనిచేశామనే సంతృపి జీవితాంతం ఉండిపోతుంది. అందుకే స్వయంకృషి సినిమా చేశారు. కానీ ఈ సినిమా భారీ హిట్ సాధించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. చెప్పులు కుట్టుకునే ఓ సాధారణ వ్యక్తిగా చిరంజీవి నటించడం ఎంతో గొప్ప విషయం. ఆ పాత్రలో చిరు జీవించారనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆయన కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలిచింది.

ఇలా గొప్పగా నిలిచిన సినిమాలు రుద్రవీణ, ఆపద్భాంధవుడు. ఫ్లాపయినా చిరు చేసిన ఈ సినిమాలతో ఎంతో సంతృపి చెందారు. కె బాలచందర్ లాంటి లెజండరీ దర్శకుడితో చిరంజీవి సినిమా అంటే గొప్ప అవకాశం. ఇక ఈ సినిమాతో తన బ్రదర్ నాగబాబును నిర్మాతగా మార్చారు. తన తల్లి అంజన ప్రొడక్షన్స్ పేరుతో నాగబాబు నిర్మాతగా రూపొందిన రుద్రవీణ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించలేదు. జాతీయ అవార్డ్ దక్కించుకుంది. చిరు కెరీర్‌లో ఓ గొప్ప సినిమాగాను నిలిచింది.

ఇక ఆపద్భాంధవుడు సినిమా మెగాస్టార్ చేసిన మరో మంచి సినిమా. మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ఆయన సెంటిమెంట్ ప్రకారం టైటిల్ పెట్టకపోవడమా లేక కథలో మెగాస్టార్ సూటవకపోవడమా అంటే ఇవన్నీ కారణాలే అని చెప్పుకున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఇలా గొప్ప సినిమాలుగా పేరు తెచ్చుకున్న రుద్ర వీణ, ఆపద్భాంధవుడు కమర్షియల్‌గా హిట్ కాకపోవడానికి కారణం చిరంజీవిని ఇలాంటి కథల్లో అభిమానులు ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడకపోవడమే అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కరెంట్ లేకుండా ఇల్లు కూలర్‌లా చల్లగా! ఈ పాత ట్రిక్ ట్రై చేయండి!

వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…

1 minute ago

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

8 minutes ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

16 minutes ago

కళ్ల సమస్యలు పోతాయట! ఈ వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…

35 minutes ago

ట్రెండ్ కోసం ఈ పేర్లు పెడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు!

పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…

43 minutes ago

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

51 minutes ago