Featured

ఐరెన్ లెగ్ అనే ముద్ర ఆ స్టార్ హీరోయిన్ మీద పడబోతుందా..?

సినిమాతో సక్సెస్ కొట్టినంత వరకే హీరోయిన్స్‌ను నెత్తిన పెట్టుకుంటారు. ఓ రెండు ఫ్లాపులొచ్చాయంటే మీరు మాకు లక్కీ హీరోయిన్ అన్న వారే మొహం చాటేస్తారు. సినిమా హిట్ అవ్వాలంటే ఒక్క హీరోయిన్ చేతిలో ఏమీ ఉండదు. కథ, కథనం..దాన్ని జనాలకు నచ్చే విధంగా తీసే దర్శకుడు.. ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏనాటి నుంచో వస్తున్న సెంటిమెంట్ హీరోయిన్‌ది గోల్డెన్ లెగ్ లేదా ఐరెన్ లెగ్ అని చెప్పుకోవడం.

ఓ హీరోయిన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకుంటుంటే ఇక హీరోతో పనేముంది. వాస్తవంగా ఆలోచిస్తే అదే కదా కరెక్ట్. అంతేకాదు ఇక అన్నీ సినిమాలలో హీరోయిన్‌గా ఆమెనే తీసుకోవాలి. ఇది జరుగుతుందా అంటే అంత సీన్ లేదు. ఇక ఒక హీరోయిన్ వల్ల సినిమా ఫ్లాప్ అయిందీ అంటే అది ఆమె లెగ్ ప్రభావం కాదనేది కొందరి అభిప్రాయం. కథ అందులో పాత్రకు సూటయ్యే హీరోయిన్ ఎంపిక కరెక్ట్‌గా లేకపోవడమే సినిమా ఫ్లాప్ కి ముఖ్య కారణం అవుతుంది.

సరిగ్గా ఆలోచిస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ, అంత డీప్‌గా ఎవరూ ఆలోచించడం లేదు. హీరోయిన్ వల్లే అనే ఓ మాట ఫట్ మని అనేస్తున్నారు. హీరోయిన్‌కు యాక్టింగ్ రాక..ప్రేక్షకులను మెప్పించలేక కనుమరుగైన హీరోయిన్స్ ఉన్నారు గానీ, ఆమె లెగ్గు పెడితే సినిమా ఫ్లాయింది అనే హీరోయిన్ ఉండదు.. అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా వరకు ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌కు ఇప్పుడు అవకాశాలు తగ్గడానికి ముఖ్య కారణం వరుసగా ఫ్లాపులు వస్తుండటమే.

ఈ మధ్య కాలంలో కీర్తి సురేశ్ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతోంది. ఆమె నటించిన ఎలాంటి సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద ఎందుకో సరిగా ఆడటం లేదు. సరైన కథలను ఆమె ఎంపిక చేసుకోకపోవడమే ఇందుకు పెద్ద కారణం అని చెప్పక తప్పదు. మహానటి లాంటి భారీ సక్సెస్ తర్వాత కీర్తి సురేశ్ చక చకా సినిమాలు ఒప్పేసుకుంది. కానీ, ఇప్పటి వరకు మంచి కమర్షియల్ హిట్ దక్కింది లేదు. పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే, అణ్ణాత్తా, ఇటీవల వచ్చిన మరక్కార్..అన్నీ సినిమాలు ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరాయి.

అందుకే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నా ఆమెను ఒద్దనుకుంటున్నారట. హోప్స్ మొత్తం మహేశ్ బాబుతో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా మీదే ఉన్నాయి. సొంత బ్యానర్‌లో సినిమా చేస్తున్నా అది సౌత్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చెప్పడం కష్టం. తెలుగులో నాని సరసన దసరా సినిమా చేస్తుంది. ఇది కూడా హిట్ అవ్వాలి. అలాగే చిరంజీవి సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా హిట్ అయినా ఆమెకు హీరోయిన్‌గా మాత్రం క్రేజ్ రాదని చెప్పక తప్పదు. ఇక పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కబోతున్న తమిళ హీరో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడి పల్లి – దిల్ రాజు ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఆమెనే అనుకుని ఇప్పుడు వద్దనుకున్నారట. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌లో కీర్తి లేదనే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago