Featured

అప్పట్లో అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళితే చెట్ల చాటునే హీరోయిన్స్ అవన్నీ చేసేవారట..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎనలేని మార్పు వచ్చాయి. కథ, బడ్జెట్, హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్, సినిమా మేకింగ్, టెక్నాలజీ ఇలా ఇప్పుడు కొత్తగా చేరిన రెండు విభాగాలు సహా 24 విభాగాలలో జనరేషన్ తో పాటు సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ వల్ల ఊహించని మార్పులు వచ్చాయి. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఏది మాట్లాడినా కోట్లలోనే అంటున్నారు. రచయిత కథ రాయాలంటే ఏ ఊటికో వెళ్ళి సిట్టింగ్ వేయాలి. గతంలో మాదిరిగా నాలుగు గోడల మధ్యనో లేక స్టూడియోలోనో కూర్చుంటేనో కథ పుట్టడం లేదు. మన పూరి జనగన్నాథ్ అయితే కొత్త ఐడియా రావడం ఆలస్యం బ్యాంకాక్ వెళ్ళిపోతారు.

ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శక, రచయితలు కథ రాయాలని వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి నిర్మాతకి మొదలైన ఖర్చు ఫస్ట్ కాపీ వచ్చి థియోటర్స్‌లో బొమ్మ పడేవరకు మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ సిట్టింగ్ అని ఎక్కడికో వెళ్ళడం మామూలైపోయింది. పబ్లిసిటీ కూడా డిజిటల్ ఫార్మాట్ అంటూ ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ రకాలుగా చేస్తున్నారు.  ఆ రోజుల్లో సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడగానే ఓ రిక్షాలో త్వరలో విడుదల, మీ అభిమాన థియోటర్స్‌లో నేడే విడుదల అంటూ మైక్ పట్టుకొని చెప్తూ తిరిగేవారు.

ఇప్పుడు సోషల్ మీడియాలోనే సినిమా ప్రమోషన్స్ జరిగిపోతున్నాయి. ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. అలాగే కావాల్సిన సినిమాను ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. అందుకే హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి పెళ్ళి చేసుకునే సమయానికి ఆమె అందుకునే రెమ్యునరేషన్ 50 వేలట. ఆ 50 వేలు ఇప్పుడు దేనికీ సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా బడ్జెట్ సగం అయితే హీరో, హీరోయిన్స్ అందుకునే రెమ్యునరేషన్..వాళ్ళ మెయింటైనెన్స్ సగం బడ్జెట్ అవుతోంది.

ఓ స్టార్ హీరోయిన్ కి కథలో పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె ఉంటే క్రేజ్ వస్తుందని హీరో పాటల కోసం కోటి నుంచి రెండు మూడు కోట్లు ఇచ్చి మరీ తీసుకు వస్తున్నారు. వీరికి మేకప్, కాస్ట్యూం చేంజ్, హెయిర్ స్టైల్ కోసం అలాగే పర్సనల్‌గా కూర్చొని రిలాక్స్ అవడానికి ఓ క్యారవ్యాన్ పెట్టాలి. దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి సొంతగా ఖరీదైన క్యారవ్యాన్ ఉంది. కానీ హీరోయిన్స్ సౌకర్యం కోసం అద్దెకి ఇలాంటి క్యారవ్యాన్స్ తీసుకు రావాల్సిందే. లేదంటే హీరోయిన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

అదే ఆ రోజుల్లో అయితే అవుట్ డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు మేకప్ వేసుకునే దగ్గర్నుంచి భోజనాల వరకు అన్నీ చెట్ల కిందనే జరిగిపోయేవి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి అనుమతులు తీసుకొని అల్లూరి సీతారామరాజు, అడవి దొంగ, కొండవీటి దొంగ, అడవి రాముడు లాంటి ఎన్నో సినిమాలు అడవుల్లో చేశారు. అక్కడ కనీసం టెలిఫోన్ సదుపాయం కూడా ఉండేది కాదు. అంతెందుకు సిటీకి చాలా దూరం ఫారెస్ట్ లొకేషన్ ఉంటే రాత్రిళ్లు అక్కడే ప్రొడక్షన్స్ వ్యానుల్లో, సొంత కారూలోనూ గడిపేవారు.

అంతేకాదు సీన్స్ కోసం హీరోయిన్స్ గానీ, హీరోలు గానీ ఇతర ఏ ఆర్టిస్టులైనా డ్రెస్ ఛేంజ్ చేసుకోవాలంటే చెట్ల చాటుకు వెళ్ళి ఛేంజ్ చేసుకునేవారు. అన్నీ ఇబ్బందులు పడి కూడా హీరోయిన్స్ దర్శక నిర్మాతలకి సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్న విషయానికే అలిగెళ్ళిపోతున్న హీరోయిన్స్ ఉన్నారంటే ఎన్ని మార్పులు, యాటిట్యూడ్ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago