Sowmyarao: జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి వారిలో సౌమ్యరావు ఒకరు. ఈమె అనసూయ ఈ కార్యక్రమానికి యాంకర్ గా తప్పకున్న తర్వాత యాంకర్ గా పరిచయమయ్యారు అయితే ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో తెలుగు పెద్దగా సరిగా రాకపోయినప్పటికీ పెద్ద ఎత్తున తన మాట తీరుతో అభిమానులను ఆకట్టుకునేవారు.
ఇలా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఈ కార్యక్రమం నుంచి సడన్ గా తప్పుకోవడంతో ఈమె స్థానంలో బిగ్ బాస్ సిరి యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి విషయం గురించి ఈమెను ప్రశ్నించడంతో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని తెలిపారు. అయితే తాజాగా తాను జబర్దస్త్ వదిలేయడానికి కారణాలను తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమం ఒక తెలుగు షో నాకు తెలుగు సరిగా రాదు. ఇలా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలామంది నన్ను విమర్శలు చేశారు అంతే కాకుండా నాకు డాన్స్ కూడా పెద్దగా రాదు అందుకే డాన్స్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా క్లాసెస్ కి కూడా వెళ్తున్నానని తెలిపారు. అసలే తాను చాలా సన్నగా ఉంటానని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో మరింత సన్నగా అవుతున్నానని తెలిపారు.
జోక్స్ అర్థమయ్యేవి కాదు..
ఇలా నేను సన్నగా అవ్వడం చూసినటువంటి జబర్దస్త్ డైరెక్టర్ డాన్స్ ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు మీరు ప్రాక్టీస్ చేయడం మానేయండి అంటూ నాకు సలహా ఇచ్చారు కానీ ఇలా డాన్స్ చేయలేక సరిగా తెలుగు మాట్లాడలేక స్కిట్ చేసేటప్పుడు ఆ జోక్స్ అర్థం కాక నేను ఎంతో ఇబ్బంది పడ్డానని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…