Janhvi Kapoor: జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ సాధించడం కోసం కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయం కాబోతున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన బవాల్ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇకనటిగా ఇండస్ట్రీలో శ్రీదేవి సినీ ప్రస్థానం ఏంటో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి 2018లో దుబాయ్ లో మరణించారు. ఇలా ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో
భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
అమ్మ తన సినీ కెరియర్ ను చూడలేకపోయిందని ఈమె తెలిపారు .అమ్మ చనిపోయిన సమయంలో తాను దడక్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.అమ్మ మరణం తర్వాత నాకు పరిస్థితులన్నీ చాలా కష్టంగా మారిపోయాయి. అమ్మ లేని లోటును ఎవరు తీర్చలేకపోయారు. ఆ కొద్ది రోజులు కాలంతో తాను పెద్ద యుద్ధం చేస్తూ ఆ బాధ నుంచి బయటపడ్డానని ఈ సందర్భంగా తల్లి మరణం గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…