Journalist Prabhu : రాకేష్ మాస్టర్ ఒక దారి తప్పిన మంచి డాన్సర్… తాను చేసిన కొన్ని తప్పులే ప్రాణం పోయేలా చేసాయి…: జర్నలిస్ట్ ప్రభు

Journalist Prabhu : ఆదివారం నాడు రాకేష్ మాస్టర్ కన్నుమూసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఆయన గురించి కథనాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆయన మరణించాకే ఆయన ఎంత గొప్ప మాస్టర్ అనే విషయం చాలా మందికి తెలిసింది. సుమారు 1500 కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసిన ఆయన ఎంతో మంది స్టార్లతో కలిసి పనిచేసిన మేటి టెక్నీషియన్. కానీ ఆయన జీవితాన్ని ఆయనే చెజేతులా పాడు చేసుకుని చివరకు ఇలా మరణించారంటూ ఆయన గురించి ఆయన శిష్యులు, అభిమానులు అలాగే సినిమా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక రాకేష్ మాస్టర్ జీవితం గురించి జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు.

ఆయన వెలుగును ఆయనే అర్పేసుకున్నారు…

రాకేష్ మాస్టర్ ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేద కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న వ్యక్తి అంటూ ప్రభు తెలిపారు. తిరుపతి లో ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా డాన్స్ మీద ఇష్టంతో చెన్నై వెళ్లి ముక్కురాజు మాస్టర్ వద్ద మెలకువలు నేర్చుకుని మాస్టర్ గా ఎదిగాడు. అయితే తన ముక్కుసూటి తనం వల్లే చాలా సార్లు ఇబ్బందులను ఎదుర్కొన్న రాకేష్ మాస్టర్ తన ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ పోగొట్టుకోడానికి మద్యానికి అలవాటు పడి చివరకు వ్యసనంగా మార్చుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంటూ తెలిపారు.

తన కెరీర్ లో అత్యున్నత స్థాయి చూసిన రాకేష్ మాస్టర్ తన వెలుగును తానే ఆర్పేసుకున్నాడు అంటూ చెప్పారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానెల్ ద్వారా నోటికి వచ్చినట్లు కొంత మందిని తిట్టడం వంటివి చేసి మరింత పలుచన అయ్యాడు అంటూ ప్రభు అభిప్రాయపడ్డారు. అయితే రాకేష్ మాస్టర్ తనకు డబ్బు ఉన్న రోజున సహాయం చేసాడు. అలాగే తన దగ్గర పెద్దగా డబ్బు లేనపుడు కూడా సాయం చేసాడు అంటూ ప్రభు తెలిపారు.