Featured

Sathya Master : రాకేష్ మాస్టర్ పిల్లల బాధ్యత మాదే… నేను, శేఖర్ మాస్టర్ అన్నీ చేస్తాం…పెద్దకర్మ కార్యక్రమం మా ఖర్చుతో చేస్తాం…: సత్య మాస్టర్

Sathya Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు.

ఆయన శిష్యులుగా ఋణం తీర్చుకుంటాం…

సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరూ రాకేష్ మాస్టర్ కి ప్రియ శిష్యులు. ఆయన చనిపోయిన తరువాత అంత్యక్రియల దగ్గరి నుండి అన్ని పనులనూ చూసుకున్నారు. ఇక ఇంటర్వ్యూలో సత్య మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ కుటుంబంతో మాట్లాడిన తరువాతే ఆయన శవాన్ని ఇంటివద్దే ఉంచామని సత్య మాస్టర్ తెలిపారు. ఇక పెద్ధ కర్మ గ్రాండ్ గా శేఖర్ మాస్టర్ తాను చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. శేఖర్ ఇప్పటికీ బాధలో ఉన్నాడని, తాను చాలా సెన్సిటివ్ అంటూ మాస్టర్ కి మాకు మధ్య ఎన్ని జరిగినా మా బంధం అలానే ఉంది అంటూ చెప్పారు.

ఇక పిల్లల బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పారు. రాకేష్ మాస్టర్ భార్య లక్ష్మి గారి అనుమతితోనే పిల్లలకు ఏ రంగం వైపు వెళ్లాలని ఇష్టం ఉందో దానికి తగ్గట్టు చదివించడానికి సహాయం చేస్తామని చెప్పారు సత్య. మాస్టర్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్లలో చాలా మంది ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టి సహాయం చేయాలని అనుకుంటున్నారు. అలాగే వారి కుటుంబానికి సహాయం చేయాలని అనుకుంటున్నారు. కానీ కుటుంబానికి సహాయం చేయాలని భావిస్తే రాకేష్ మాస్టర్ భార్య లక్ష్మి గారి అనుమతి తీసుకున్నాకే ఏదైనా చెప్పగలం అంటూ అన్నింటికీ ఒక క్లారిటీ వస్తుంది త్వరలోనే మరోసారి ప్రకటిస్తామని సత్య మాస్టర్ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago