Featured

Sathya Master : రాకేష్ మాస్టర్ ది హత్య… ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి… ఫోన్ మాయమైంది… నేను, శేఖర్ రాకేష్ మాస్టర్ వల్ల తన్నులు తిన్నాం…: సత్య మాస్టర్

Sathya Master : గత ఆదివారం నాడు రక్తపు వాంతులు, విరేచనాలతో రాకేష్ మాస్టర్ గాంధీ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనది సహజ మరణం అని అందరూ భావించినా తాగుడు ఎక్కువై ఆరోగ్యం పాడైపోయి మనిషి చనిపోయాడని అందరూ భావించినా ఆయన దగ్గరున్న వాళ్ళు ఆయన శిష్యులు మాత్రం ఆయనది సహజ మరణం కాదు, ఎవరో చనిపోయేలాగా కొట్టారు అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ శిష్యుడైన సత్య మాస్టర్ ఈ ఇష్యూ గురించి మాట్లాడారు.

రాకేష్ మాస్టర్ వల్ల దెబ్బలు తిన్నాం…

శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఇద్దరూ రాకేష్ మాస్టర్ కి శిష్యులు. ఆయనతో 24 గంటలు ఉంటూ అన్ని పనులను చేసిపెట్టేవారు. ఆయన బాగా తిట్టేవాడని కానీ అదే సమయంలో మా మంచి చెడులు ఆయని చూసుకున్నారు అంటూ సత్య మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి తెలిపారు. ఆయన వల్ల ఎన్నో సార్లు గొడవలలో మేము ఇరుక్కున్నాం అలాగే ఇబ్బందులను ఎదుర్కొన్నాం అంటూ సత్య మాస్టర్ తెలిపారు.

ఇప్పటికీ మాస్టర్ పక్కన మేము లేకపోయి ఉండవచ్చు కానీ మాస్టర్ కి అందుబాటులో అయితే ఎపుడూ ఉన్నాం అంటూ చెప్పారు. ఇక ఆయన మరణం అనుమానాస్పదంగా ఉందని రాఖీ భాయ్ అనే వ్యక్తి మాట్లాడినపుడే తెలిసింది. బీర్ తాగి ఎండకు డీ హైడ్రేట్ అయి మరణించాడనే తెలుసు. ఆయన మరణించాక ఏం చేయాలి ఎలా అన్ని పనులను చూసుకోవాలి అనే ఆలోచించాం కానీ ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయని నోరు పగిలి రక్తం వచ్చిందని కానీ ఎవరూ మాతో చెప్పలేదు. అక్కడ ఉన్నవారు ఒకసారి చెప్పినా ఆ ఇష్యూ గురించి ఆలోచించేవాళ్లం. ఇక ముఖం మీద ఎలాంటి గాయాలు లేవు, ఆయన ఒంటి మీద నేను గమనించలేదు అంటూ సత్య మాస్టర్ తెలిపారు. ఆయనకు సంబంధించిన వస్తువులు ఫోన్ కనిపించడం లేదని ఆయన ఆనుమానాలను మా దృష్టికి తెచ్చుంటే బాగుండేదని సత్య మాస్టర్ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago