Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఇలా బాహుబలి సినిమా తర్వాత సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ తాజాగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుందని చెప్పాలి. ఇక ఈయన ప్రాజెక్టుకే, స్పిరిట్, సలార్, మారుతి డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేయబోతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ తాను సినిమాలలో సంపాదించిన కొంత మొత్తాన్ని ఇటలీలో పెట్టుబడులుగా పెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన ఇటలీలో అన్ని సౌకర్యాలతో ఎంతో సుందరమైనటువంటి విల్లాని కొనుగోలు చేశారని ఓ ఆంగ్ల మీడియా ప్రచురించింది.
ఇక ప్రభాస్ కి ఎప్పుడైతే షూటింగ్స్ ఉండవో ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి ఇటలీ వెళ్లి ఈ విల్లాలోనే గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటారని సమాచారం. ఇక తనకు సినిమా షూటింగ్స్ లేకపోతే కనుక ఈ విల్లాను అద్దెకు ఇస్తారట. ఈ విధంగా ఇటలీలో ఉన్నటువంటి తన విల్లా ప్రభాస్ అద్దెకు ఇస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.
ఇలా ఈ విల్లా అద్దెకు ఇచ్చినటువంటి ప్రభాస్ నెలకు 40 లక్షల రూపాయల వరకు అద్దే అందుకుంటున్నారని సమాచారం. కేవలం అద్దె రూపంలోనే ప్రభాస్ నెలకు 40 లక్షలు సంపాదిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తన స్నేహితులకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…