Actor Kamal : ఆర్జీవి క్షణక్షణం సినిమాతో పరిచయమైన నటుడు కమల్ ఆపైన సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా కి జోడిగా నటించారు. ఆ సినిమాలో పూసింది పూసింది పున్నాగా పాట అందరికీ గుర్తుంటుంది. క్షణ క్షణం సినిమాలో వెంకటేష్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ లో అలరించిన ఆయన కూలి నెంబర్ వన్ అంటూ వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్జీవి నే మొదట నన్ను నమ్మాడు అంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ కొమరం పులి, జల్సా, వంటి సినిమాల్లో నటించిన ఆయన తాజాగా పవన్ నెక్స్ట్ సినిమా ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ లో నటించనున్నారు. ఆ సినిమా విశేషాలతో పాటు ఆయన భవిష్యత్ లక్ష్యాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
పవన్ ఎలా ఉంటారంటే… హర్షసాయి తో సినిమా…
కమల్ తాజాగా తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి హీరోగా సినిమాలను చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వెంకటేష్ గారి లాగా ఫ్యామిలీ సబ్జెక్టు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ‘ఓజి’ లో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. సినిమా చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ సినిమాలో పవన్ లుక్, సినిమా డైరెక్షన్ తో సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటుంది అంటూ చెప్పారు.
పవన్ చాలా సింపుల్ గా ఉంటారు అందరితో మాట్లాడుతూ అన్నీ గమనిస్తుంటారు. కొమరం పులి ఇద్దరం కలిసి చేసాం మళ్ళీ జల్సా సినిమా సమయంలో మాట్లాడుతూ హెయిర్ కట్ గురించి మాట్లాడారు. అలా ప్రతి చిన్న విషయం ఎదుటివారిలో ఆయన గమనిస్తారు అంటూ చెప్పారు. ఇక తాజాగా యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన హర్ష సాయి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమా కేజిఎఫ్ రేంజ్ లో ఉండబోతోంది. మిత్రా శర్మ అనే అమ్మాయి నిర్మాత గా హర్ష సాయి డైరెక్షన్ లో వస్తుంది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…