ఎక్కడో హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ఆ తరువాత బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు దేశంలోని అన్ని ఇండస్టీలలో ఊపందుకుంది. గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంది హీరోయిన్లు, నటీమణులు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి మీడియా ముందు తమకు జరిగిన లైంగిక వేధింపులను వివరించారు.
బాలీవుడ్ లో ముందుగా తనుశ్రీ దత్త మొదలుపెట్టిన మీటూ ఉద్యమం ఆ తరువాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వారు మీడియా ముందు బయటపెట్టారు. ప్రముఖ నటుడు నానాపటేకర్ పై తనుశ్రీ దత్త చేసిన లైంగిక ఆరోపణలతో మీటూ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా మీటూ ఉద్యమంపై నటి కాజోల్ మాట్లాడుతూ మీటూ వల్ల ఇండస్ట్రీకి మంచే జరిగిందని.. దాని వల్ల చాలా మంది నటులు, దర్శకులు ఇండస్ట్రీలోని మహిళలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలిపింది.
దీనిపై కియారా మాట్లాడుతూ మీటూ ఉద్యమం వల్ల ఒరిగిందేమీ లేదని, మీటూ వల్ల ప్రపంచం ఏమి మారిపోలేదని తెలిపింది. మీటూ వల్ల పెద్ద మార్పేమీ రాలేదని పేర్కొంది. మీటూ ఇంకా తర్వాతి దిశకు చేరుకోలేదని అభిప్రాయపడింది. మీటూ ఫలితం ఇంకా రాలేదని కియారా అద్వానీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. తెలుగులో కూడా ఒక సినిమా చేయబోతుంది. ఈ సినిమాకు సంబందించిన విషయంలో త్వరలో బయటకురానున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…