ఒకప్పుడు అన్నమయ్య,భారతీయుడు వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ కస్తూరి శంకర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్న కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. చదివినది లాయర్ చదువు కావడంతో సమాజంలో జరిగే సమస్యలు, అన్యాయాలను ఎదిరిస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈమె చేసే ట్వీట్స్ కొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తుంటాయి.
తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనలపై స్పందించారు.బెంగాల్‌లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అక్కడకు రావడంతో అతనిపై రాళ్ల దాడి జరగడంతో ఈమె స్పందించారు.
ఒక కేంద్ర మంత్రి హోదాలో ఎంతో సెక్యూరిటీతో వచ్చినమంత్రి పై ప్రజలు దాడి చేస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఒక కేంద్ర మంత్రికి ఈ విధమైనటువంటి సంఘటన జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఊహించలేకపోతున్నాను. అసలు వాళ్ళు మనుషులేనా? అది గూండా రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా గౌరీశంకర్ పశ్చిమ బెంగాల్ ఘటనపై జరిగిన సంఘటనకు స్పందించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…