Konda Surekha : జగన్ కు వైస్సార్ కు ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది… ఇతరుల ఎదుగుదలను జగన్ ఓర్వలేడు…!

Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు తెలియని వారు ఉండరు. కొండా మురళి, కొండా సురేఖ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ రాజకీయాలు చేసారు. రాజశేఖర్‌రెడ్డి గారు బ్రతికున్నంత వరకు ఆయన వెంటే ఉన్న కొండా సురేఖ ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డికి కూడా అండగా నిలబడి ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీ లో మంత్రి పదవికి రాజీనామా చేసారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెరాస లో చేరారు.

వైస్సార్ కు జగన్ కు పొంతన లేదు…

తాజాగా కొండా సినిమా ద్వారా కొండా దంపతుల జీవితం గురించి ఆర్జీవి సినిమా తీసాడు. ఇక ఈ సినిమా విడుదల సందర్బంగా అనేక ఛానెల్స్ లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు కొండా సురేఖ. ఇక ఒక ఇంటర్వ్యూలో వైస్సార్, జగన్ గురించి అడుగగా ఇద్దరికి అసలు పొంతన లేదని చెప్పి షాక్ ఇచ్చింది. వైస్సార్ ఇతరుల ఎదుగుదలను కోరుకుంటారని, కానీ జగన్ అలా కాదని ఆయన ముందు ఇంకొకరు పైకొస్తుంటే ఓర్చలేరని చెప్పారు. వైస్సార్ ఉన్నపుడు జగన్ ఎవరో మాకు తెలియదని వైస్సార్ చనిపోయాకే జగన్ ను కలిశామని అయితే ఆయన వాళ్ళ తండ్రి లాగా కాదని చెప్పారు.

రాజశేఖరరెడ్డి చనిపోయాక వివిధ పార్టీలనుండి పిలుపులు వచ్చాయి. టీడీపీ నుండి కూడా పిలుపు వచ్చిందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి పార్టీ లోకి ఆహ్వానించారాని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా మేము ఎలా టీడీపీ లో ఉంటామని, పరకాలలో టీడీపీ తరుపున దయాకర్ రావు ఉన్నాడు కదా అనగా దయాకర్ రావు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు మీరు టీడీపిలో చేరండి అని పిలిచారట, అలోచించి చెబుతామని వచ్చాక వెళ్లలేదని చెప్పారు.