Featured

Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సోనాలి బింద్రే… అవన్నీ వట్టి పుకార్లే?

Sonali Bendre: సీనియర్ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరూ సరసన నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సోనాలి బింద్రే గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె విదేశాలలో చికిత్స తీసుకొని ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.

 

sonali-bendre-reacts-to-the-news-about-financial-difficulties-and-says-its-just-a-rumours

ఇక ప్రస్తుతం సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండడంతో ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే అవకాశాల కోసం సోనాలి బింద్రే ఎదురు చూస్తుందని, కథ నచ్చితే తప్పకుండా తను నటించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇకపోతే సోనాలి బింద్రే అనారోగ్యం కారణంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని వార్తలు వచ్చాయి.

sonali-bendre-reacts-to-the-news-about-financial-difficulties-and-says-its-just-a-rumours

ఈ విధంగా ఈమె ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడం వల్ల తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తిరిగి సినిమాలలో నటిస్తుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై సోనాలి బింద్రే స్పందించారు. తాజాగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.ఈ వెబ్ సిరీస్ జూన్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రే తన గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు…

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆర్థిక ఇబ్బందుల వల్లే సతమతమవుతున్నానని, దర్శక నిర్మాతలను అవకాశాలు కావాలని అడుగుతున్నాను అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి బాగా ఉందని తాను ఎవరిని అవకాశాలు ఇవ్వమని అడగడం లేదు, తనకు ఆ అవసరం రాలేదని ఈమె తెలిపారు.నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వార్తలలో ఏమాత్రం నిజం లేదు అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నేను నటిస్తున్నానని వచ్చే వార్తలలో కూడా నిజం లేదు ఇవన్నీ ఒట్టి పుకార్లేనని సోనాలి బింద్రే కొట్టి పారేశారు.ప్రస్తుతం తాను ఎలాంటి సినిమాలలోనూ నటించలేదని మంచి కథ పాత్ర దొరికితే తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago