Connect with us

Featured

Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సోనాలి బింద్రే… అవన్నీ వట్టి పుకార్లే?

Published

on

Sonali Bendre: సీనియర్ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరూ సరసన నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సోనాలి బింద్రే గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె విదేశాలలో చికిత్స తీసుకొని ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.

 

Advertisement
sonali-bendre-reacts-to-the-news-about-financial-difficulties-and-says-its-just-a-rumours

sonali-bendre-reacts-to-the-news-about-financial-difficulties-and-says-its-just-a-rumours

ఇక ప్రస్తుతం సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండడంతో ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే అవకాశాల కోసం సోనాలి బింద్రే ఎదురు చూస్తుందని, కథ నచ్చితే తప్పకుండా తను నటించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇకపోతే సోనాలి బింద్రే అనారోగ్యం కారణంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని వార్తలు వచ్చాయి.

sonali-bendre-reacts-to-the-news-about-financial-difficulties-and-says-its-just-a-rumours

sonali-bendre-reacts-to-the-news-about-financial-difficulties-and-says-its-just-a-rumours

ఈ విధంగా ఈమె ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడం వల్ల తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తిరిగి సినిమాలలో నటిస్తుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై సోనాలి బింద్రే స్పందించారు. తాజాగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.ఈ వెబ్ సిరీస్ జూన్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రే తన గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు…

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆర్థిక ఇబ్బందుల వల్లే సతమతమవుతున్నానని, దర్శక నిర్మాతలను అవకాశాలు కావాలని అడుగుతున్నాను అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి బాగా ఉందని తాను ఎవరిని అవకాశాలు ఇవ్వమని అడగడం లేదు, తనకు ఆ అవసరం రాలేదని ఈమె తెలిపారు.నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వార్తలలో ఏమాత్రం నిజం లేదు అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నేను నటిస్తున్నానని వచ్చే వార్తలలో కూడా నిజం లేదు ఇవన్నీ ఒట్టి పుకార్లేనని సోనాలి బింద్రే కొట్టి పారేశారు.ప్రస్తుతం తాను ఎలాంటి సినిమాలలోనూ నటించలేదని మంచి కథ పాత్ర దొరికితే తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Featured

Allu Shirish: అదే అన్నయ్య ధైర్యం.. మెగా అల్లు గొడవల పై శిరీష్ షాకింగ్ కామెంట్స్ !

Published

on

Allu Shirish: సినీ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ కుటుంబం నుంచి అల్లు అరవింద్ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ కాగా అరవింద్ కుమారులు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అల్లు శిరీష్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతున్నారు.

ఇలా శిరీష్ ఇప్పటివరకు తెలుగులో పలు సినిమాలలో నటించారు. అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. త్వరలోనే ఈయన మరో సరికొత్త చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ అనే చిత్రం జులై 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా ప్రతి ఒక్క హీరోకి కూడా పీఆర్ టీం ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి కూడా గత పది సంవత్సరాలుగా ఈ టీం ఉందని అయితే ఈ టీం చాలా పెద్దదని తెలిపారు.

Advertisement

పీ ఆర్ టీమ్…
అన్నయ్యకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా వెంటనే నెగిటివిటీ వ్యాపించకుండా ఈ టీం అడ్డుకుంటుందని, ఇక తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతూ తనకు ఒక ధైర్యంలా ఉంటారని తెలిపారు. ఈ పిఆర్ టీమ్ అన్నయ్య ధైర్యం అంటూ శిరీష్ తెలిపారు. ఇక గత కొద్దిరోజులుగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల గురించి వస్తున్న వార్తల గురించి కూడా తన పీ ఆర్ టీమ్ చూసుకుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Bollywood Heroes: అనంత్ అంబానీ పెళ్లి.. కళ్ళు చెదిరే కానుకలు ఇచ్చిన బాలీవుడ్ హీరోలు?

Published

on

Bollywood Heroes: ఇటీవల భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పెళ్లి వేడుకల కోసం సుమారు 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ క్రీడా రంగానికి చెందిన వ్యక్తులు వ్యాపారం వేత్తలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ తారలందరూ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అనంత అంబానీ పెళ్లిలో ఇచ్చిన గిఫ్ట్ లకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనంత రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా బాలీవుడ్ తారలు అయినా రణబీర్ కపూర్ అలియా భట్ 9 కోట్ల విలువచేసే బెంజ్ కారు, సల్మాన్ 15 కోట్ల విలువచేసే బైక్, రణవీర్ దీపిక 20 కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిస్, విక్కీ కౌశల్ కత్రినా 19 లక్షల విలువ చేసే బంగారు చైన్, అక్షయ్ కుమార్ 60 లక్షల విలువ చేసే గోల్డెన్ పెన్ కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.

Advertisement

40 కోట్ల అపార్ట్మెంట్..
ఇలా వీరంతా కూడా అనంత్ అంబానికి చాలా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. అయితే బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ మాత్రం ఎవరు ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఈయన ఈ జంటకు ఫ్రాన్స్ లో 40 కోట్ల రూపాయల విలువ చేసే ఒక అపార్ట్మెంట్ కానుకగా అందించారని సమాచారం. ఇలా బాలీవుడ్ తారలందరూ కూడా కళ్ళు చెదిరిపోయే కానుకలు ఇచ్చారంటూ వస్తున్న ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Rajamouli: రాజమౌళి ఓ పిచ్చోడు… సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్.. ఏమైందంటే?

Published

on

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈయన తెలుగు సినీ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్లు కూడా చర్చించుకునే స్థాయికి ఎదిగారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న రాజమౌళి డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రసారం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరిట ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

ఇందులో భాగంగా పలువురు సెలబ్రిటీలో రాజమౌళి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రాజమౌళికి కొంచెం కూడా సానుభూతి లేదని తెలిపారు. ఆయన ఓ సినిమా పిచ్చోడు ఆయనకు కావలసింది ఇచ్చి మనం వెళ్ళిపోవడమే అని తెలిపారు. ఇప్పటివరకు ఎవరు పరిచయం చేయని కథలను పరిచయం చేయడం కోసమే రాజమౌళి జన్మించారని తెలిపారు.

Advertisement

పని రాక్షసుడు..
ఇక రాంచరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి గారి సినిమాలలో నన్ను నేను చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడినని తెలిపారు. ఇక ప్రభాస్ కూడా రాజమౌళి గురించి మాట్లాడారు. రాజమౌళి గారి లాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు ఆయనకు సినిమాలు అంటే పిచ్చ ప్రేమ అని తెలిపారు. ఇక రమా రాజమౌళి కూడా మాట్లాడుతూ ఇప్పటివరకు రాజమౌళి గారితో పనిచేసిన వారందరూ ఆయనని పని రాక్షసుడు అంటారు అంటూ ఈమె వెల్లడించారు. ఇలా సెలబ్రిటీలందరూ రాజమౌళి గురించి చెబుతున్నటువంటి ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!