Bandla Ganesh: బండ్ల గణేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన నటుడుగా నిర్మాత కన్నా సంచలన వ్యాఖ్యల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఏదైనా ఒక ట్వీట్ చేసిన, లేదా ఒక వేదికపై మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పూరి జగన్నాథ్ గురించి పరోక్షంగా ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఇలా ఈ వివాదం ఇక్కడితో ముగిసింది అనుకునే లోపు మరో వివాదానికి తెర లేపారు. బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే… టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి తండ్రి అయిన విషయం మనకు తెలిసిందే. ఈయన రెండవ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఇకపోతే దిల్ రాజు మరోసారి తండ్రి కావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సైతం దిల్ రాజు అన్నకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తూ ఈ ట్వీట్ దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ (SVC) ట్యాగ్ చేయడం కాకుండా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ కి ట్యాగ్ చేశారు. ఈ బ్యానర్ ప్రముఖ సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ ది కావడం గమనార్హం.
ఒకసారి చూసుకోవాలి కదా బండ్లన్న..
ఈ విధంగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మిస్ ఫైర్ కావడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు తండ్రి అయితే ప్రసాద్ గారికి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి బండ్లన్నా అంటు కొందరు కామెంట్లు చేయగా మరికొందరు కాస్త చూసుకోవాలి కదా… ఒకవేళ తప్పుగా ట్వీట్ చేసిన తర్వాత అయినా ఆ ట్వీట్ డిలీట్ చేయాలి కదా అంటూ అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…