Krishna Vamsi : రవితేజ, బండ్ల గణేష్ గురించి నేను మాట్లాడను.. నన్ను అడగొద్దు.. బెల్లం కొండ విషయంలో జరిగింది ఏమిటంటే? : కృష్ణ వంశీ

Krishna Vamsi : రంగ మార్తాండా సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కృష్ణ వంశీ. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయినా, కేక సోషల్ మెసేజ్ అయినా కృష్ణ వంశీ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణ వంశీ గులాబీ, సింధూరం, సముద్రం, అంతఃపురం, నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చారు. ఖడ్గం వంటి సినిమా అయినా మొగుడు వంటి ఫ్యామిలీ డ్రామా అయినా కృష్ణ వంశీ స్టైల్ డిఫరెంట్. కానీ ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత కృష్ణ వంశీ సినిమా తీయబోతున్నారు.

వారి గురించి మాట్లాడొద్దు…

ఇక కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రవితేజ ప్రస్తుతం సూపర్ స్టార్ అయ్యాడు. కృష్ణ వంశీ, రవితేజ తో ఒక సినిమా తీయాలని కథ మీద చాలా కష్ట పడ్డాడు, అయితే ఇద్దరి మధ్య ఏవో తేడాలు రావడంతో సినిమా ఆగిపోయింది. ఇక ఈ విషయం పై కృష్ణ వంశీ మాట్లాడటానికి నిరాకరించారు. ఇక బండ్ల గణేష్ గోవిందుడు అందరివాడేలే సినిమా సమయంలో కృష్ణ వంశీ గురించి పరోక్షంగా విమర్శించాడు. సినిమా గురించి కృష్ణ వంశీ కి ధ్యాస లేదు సరిగా చేసుంటే గోవిందుడు అందరివాడేలే సినిమా ఎక్కడో ఉండేది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఆ విషయంలో కూడా కృష్ణ వంశీ స్పందించలేదు. గతం గతః అయిపోయిన వాటి గురించి ఎందుకు, నేను మాట్లాడదలుచుకోలేదు.

బండ్ల గణేష్ అలా నన్ను అన్నాడనే విషయం నాకు తెలియదు ఒకవేళ అనుంటే అది గతం నేనెందుకు స్పందించాలి అంటూ వేదాంత ధోరణిలో చెప్పాడు. ఇక మొగుడు సినిమా సమయంలో బెల్లంకొండ సురేష్ విషయంలో కూడా వివాదం గురించి మాట దాటవేశారు, సమాధానం చెప్పడం ఇష్టం లేదని అయిపోయిన వాటిని ఎందుకు మాట్లాడాలి, ఆక్షణం అలా జరగాలనుంది జరిగింది అంతే మన చేతుల్లో ఏం లేదు అంటూ మాట్లాడారు కృష్ణ వంశీ. అప్పుడున్న ఒత్తిడిలో కొందరి వ్యక్తుల ప్రభావం వల్ల అలా జరిగిపోయాయి వాటిని ఆలోచించడం మానేసాను అంటూ చెప్పడానికి ఇష్టపడలేదు.