Krishnam Raju : నిన్న తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కృష్ణం రాజు గారు తుది శ్వాస విడిచారు. ఆయన మరణించిన తరువాత ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రాజుల వంశంలో పుట్టడం కాదు కృష్ణం రాజు గారు నిజంగా రాజే అన్నట్లు గా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యల వల్ల కృష్ణం రాజు గారు మరణించారు. ఆయన కరోనా సోకిన తరువాత కిడ్నీ పనితీరు చెడిపోయింది. ఇక కరోనా నుండి కోలుకున్నా కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన చాలా కాలం నుండి ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇక నిన్న ఉదయం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. ఇక అయనను స్మరిస్తూ చాలా మంది సిని, రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
మీకు సినిమా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా….
ఇక సీనియర్ నటుడు కైకల సత్యనారాయణ గారు కృష్ణం రాజు గారి మరణం గురించి స్పందించారు. ఎప్పటిలాగే హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగివస్తాడని అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ‘ద్రోహి’ సినిమా సమయం నుండి కృష్ణం రాజు తెలుసు ఇక అప్పటి మా పరిచయం స్నేహంగా మారి ఇప్పటి వరకు కొనసాగుతున్న వచ్చింది అంటూ కైకలా చెప్పారు. సహజంగా నాకు ఎన్టీఆర్ గొంతు తప్ప వేరే వాళ్ళది నచ్చదని ద్రోహి సినిమా చుసినపుడు ఎవరు కృష్ణం రాజుకి డబ్బింగ్ చెప్పారు అని ఆలోచించాను.
ఇక సినిమా చూసాక అల్లు రామలింగయ్య తో అడిగాను ఏమయ్యా లింగయ్య కృష్ణం రాజుకి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను అయితే తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు అని చెప్పగా ఆశ్చర్యంగా అనిపించింది. గంభీరమైన డైలాగులు, కవితలను చక్కగా చెప్పడం గమనించాను ఆ రోజు నుండి ఆయన గొంతు నాకూ బాగా నచ్చింది అంటూ కృష్ణం రాజు గారి గురించి చెప్పారు. ఇక అలా ఒక సందర్భంలో మాట్లాడుతూ చాలా చక్కగా డైలాగులు చెబుతున్నావ్ నువ్వు మరిన్ని చిత్రల్లో నటించాలి అని చెప్పగా ఏంటండీ మీకు సినిమాల్లో పాత్రలు లేకుండా చేయాలా అంటు సరదాగా అన్నాడు. నాకంటే చిన్నవాడు అయిన కృష్ణం రాజు తో మంచి అనుబంధం ఉందని చెప్పారు కైకల సత్యనారాయణ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…