Krishnam Raju : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడుగా, రాజకియం లోను రాణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మరణం సినీ, రాజకీయ రంగంలో అందరిని శోక సముద్రంలో ముంచేసింది. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున ఆయన స్వర్గస్థులు అయిన విషయం తెలిసిందే. సోమవారం అశ్రునాయనల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. అయితే ఆయన అంతిమ యాత్రలో ఆయన భార్య శ్యామలా దేవి ఆయన పాడే మోయడం అందరి చేత కంటతడి పెట్టించింది. ఏ సినీ వేడుక అయిన పెళ్లి అయిన భర్త వెంటే వుండే శ్యామల దేవి ఆయన మరణించక ఆయన పార్థివదేహంపై పడి కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచివేసింది.గతంలో శ్యామల దేవి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రభాస్ – కృష్ణంరాజు ల మధ్య బంధం గురించి ఎమోషనల్ అయిన శ్యామల దేవి…..
రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల దేవి, ప్రభాస్ కు కుటుంబం తోటి కృష్ణం రాజు గారితోటి అనుబంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో కృష్ణం రాజు గారి కాలికి దెబ్బ తగలడం చిన్న సర్జరీ చేయడం జరిగిందని అపుడు ప్రభాస్ హాస్పిటల్ లో అందరికి ధైర్యం చెప్పారాని, కృష్ణంరాజు గారికి అన్నీ తానై చూసుకున్నాడు అని చెప్పుకొచ్చారు. ప్రభాస్ కు వారి అమ్మగారు చెల్లెలు అంటే ప్రాణం అని, నన్ను కృష్ణం రాజు గారిని అందరిని అలానే చూసుకుంటారు అని మాకు కొడుకు లేని లోటు ఎప్పుడు కనిపించలేదని చెప్పుకొచ్చారు.
ప్రభాస్ కు వారి పెదనాన్న అంటే చాలా గౌరవం ఇష్టం అని చెప్పారు. ఒక్కోసారి ప్రభాస్ ను తలుచుకుంటే కళ్లల్లో నీళ్లు వస్తాయి నాకు, అంతలా మా మీద ప్రేమ చూపిస్తారు ఎవరికి ఉంటుంది ఈ అదృష్టం అని ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి కొడుకు ఉంటే అందరు గర్వపడతారు అని ప్రభాస్ గురించి చెప్పుకొచ్చింది. కృష్ణం రాజు గారు హాస్పిటల్ లో వున్నప్పుడు కూడా ఆయనతో నవ్వుతూ మాట్లాడుతూ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ధైర్యం చెప్పే వాడు. కృష్ణారాజు గారు కూడా ప్రభాస్ కెరీర్ గురించి మంచి సలహాలు ఇస్తుంటారు, వారిద్దరి అనుబంధం చాలా గొప్పది అని చెప్పుకొచ్చారు.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…