Krishnam Raju : కత్తందుకో జానకి అనే డైలాగ్ అనగానే కృష్ణం రాజుగారు గుర్తొస్తారు. కోపం, రౌద్రం ఇలా ఏదైనా నతనలో అన్ని రకాల హవాభావాలు పలికించి ఆకట్టుకున్న నటుడు కృష్ణం రాజు గారు. అయన నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయిన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించేవుంటారు. అలాంటి కృష్ణం రాజుగారికి జీవితంలో కొన్ని తీరని కోరికలు ఉండిపోయాయి. ఆ ఐదు కోరికలు ఎందకునో ఆయన ఎంత ప్రయత్నించినా జరగలేదు.
ఆ సినిమాలు… ప్రభాస్ పెళ్లి….
తమ్ముడి కొడుకే అయిన ప్రభాస్ అంటే సొంత కొడుకులాగే చూసుకున్నారు కృష్ణం రాజుగారు. ఆయన గత కొంతకాలంగా ప్రభాస్ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నించినా ఎందుకనో కుదరలేదు. ఇంటర్వ్యూ లలో కూడా త్వరలో అయిపోతుంది అంటూ చెప్పేవారు కానీ కుదరలేదు. ఇక ప్రభాస్ తో ఆయన కొన్ని సినిమాలు చేయాలని అనుకొన్నారు ఆది కూడా జరగలేదు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి ప్రభాస్ ను హీరోగా ఒక సినిమా తీయాలనీ భావించారు ఆది తీరాలేదు. ఇక ప్రభాస్ తో ఎన్ని సినిమాల్లో నటించిన కృష్ణం రాజుగారి ఆల్ టైం క్లాసిక్ సినిమా ‘భక్త కన్నప్ప’ సినిమా ప్రభాస్ తో చేయాలని అనుకున్నారు.
ఇక ఛత్రపతి సినిమాలోని ‘ఒక్క అడుగు’ డైలాగ్ ని సినిమా పేరుగా చేగువేరా కాన్సెప్ట్ తో సినిమా చేయాలని అనుకొన్నారు ఆది ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా మధ్యలో ఆగిపోయింది. ఇందులో ఐదుమంది యంగ్ హీరోస్ తో మెయిన్ లీడ్ గా ప్రభాస్ ని పెట్టి భారీ బడ్జెట్ సినిమా సొంత బ్యానర్ గోపిక్రిష్ణ నిర్మాణం లో చేయాలని అనుకున్న కుదరలేదు. ఇక ‘విశాల హృదయలు’ నవల ఆధారంగా సినిమా ప్రభాస్ తో చేయాలని భావించినా ఎందుకనో ఆది కూడా కుదరలేదు. ఇక చివరగా ఆయన రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు బీజేపీ లో సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేసారు. అయితే ఈ సారి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని భావించారు కానీ అది తీరకుండానే ఆయన మరణించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…