Featured

Lakshmi Parvathi : నా కూతురు ఉమా మహేశ్వరి సుసైడ్ లెటర్ ఎక్కడ దాచావ్ చంద్రబాబు : లక్ష్మి పార్వతి

Lakshmi Parvathi : ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగష్టు 1 తేదీన సోమవారం తన స్వగృహం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ మరణవార్త నుండి నందమూరి కుటుంబం ఇంకా షాక్ నుండి తెరుకోలేదు. ఇక అప్పుడే రాజకీయ విమర్శలు ఆరోపణలు మొదలైపోయాయి. సాధారణ మరణం అయ్యుంటే అంతగా ఎవరు పట్టించుకునేవారు కాదేమో కానీ ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అనుమానాలు బయలుదేరాయి. అసలు చనిపోవాలని నిర్ణయం తీసుకునేంత కష్టాలు ఏమున్నాయి ఉమా మహేశ్వరీ గారికి అనే ఆరాలు మొదలయ్యాయి. నిజానికి పోలీసులు అనుమానస్పద మృతిగా మొదట కేసు నమోదు చేసుకున్నా ఆ తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ ఆత్మహత్య గా వెలువడడంవల్ల ఆత్మహత్య గా నిర్ధారించారు. కానీ ఈ ఇష్యూ పై కొంతమంది రాజకీయం చేయడం చాలా బాధకారం. ఇక లక్ష్మి పార్వతి ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఉమా మహేశ్వరి మరణంలో చంద్రబాబు హస్తం ఉంది అన్నట్లు గా మాట్లాడారు.

సుసైడ్ నోట్ ఎక్కడ దాచావ్ చంద్రబాబు…

హరికృష్ణ మరణాన్ని ఇంకా మర్చిపోలేక పోతుంటే ఇపుడు నా కూతురు ఉమా మహేశ్వరి మరణం నన్ను షాక్ కి గురిచేసింది అంటూ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదంటూ మాట్లాడారు. ఇక ఉమా మహేశ్వరి గారి మరణం లో కూడా చంద్రబాబు హస్తం ఉంది అన్నట్లుగా మాట్లాడారు లక్ష్మి పార్వతి. ఎవరైనా చనిపోతే సుసైడ్ నోట్ ఖచ్చితంగా రాస్తారు. ఉమ చదువుకున్న అమ్మాయి, తనకు చనిపోవాలని అనుకున్నపుడు తాను ఖచ్చితంగా సుసైడ్ నోట్ రాసుంటుంది. ఆ సుసైడ్ నోట్ ను పోలీసులకు దొరకకుండా చంద్రబాబు నాయుడే దాచుంటాడు.

కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కు కారణం కూడా చంద్రబాబు నాయుడే. అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేసాడు. ఇతనికి శవారాజకీయాలు ముందు నుండి అలవాటే. నా భర్త ఎన్టీఆర్ మరణించడానికి కారణం కూడా ఇతనే. ఆయన చనిపోయే ముందు వాయిస్ రికార్డు చేసిన ఫోన్ ను మటుమాయం చేసాడు చంద్రబాబు, ఇప్పటికి అది బయటకు రాలేదు. కాని ఎన్టీఆర్ సంతానం మాత్రం గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు చంద్రబాబు నాయుడునే నమ్మారు. నందమూరి కుటుంబానికి చంద్రబాబు శనిలా దాపురించాడు అంటూ ఘాటు వాఖ్యలు చేసింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago