M.S. Vikram : డైరెక్టర్ సాగర్ కి మైండ్ దొబ్బింది… మా నాన్నను కొడితే చూస్తూ ఊరుకోము : ఎంఎస్ విక్రమ్

M.S. Vikram : తెలుగులో కమెడియన్స్ ఎంతో మంది ఉన్నా కొంతమంది మాత్రం మన మనస్సులో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి ఒక వ్యక్తి ఎంఎస్ నారాయణ గారు. ఆయన ఉన్న ప్రతి సినిమా విజయం సాధించకపోవచ్చు కానీ ఆయన చేసిన కామెడీ మాత్రం బాగా హిట్ అవుతుంది. తెలుగు కమెడియన్స్ బిజీ ఆర్టిస్ట్ ల్లో ఒకరిగా ఉన్న ఎంఎస్ నారాయణ గారు అనారోగ్య కారణాలతో అర్థాంతరంగా మరణించారు. ఇక ఆయన గురించి ఆయన కొడుకు విక్రమ్ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విక్రమ్ ను హీరో గా చూడాలన్నది నారాయణ గారి కోరిక అందుకే ఆయన డైరెక్టర్ గా ‘కొడుకు’ అనే సినిమా కూడా తీశారు. అయితే ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోవడం వల్ల విక్రమ్ ఇండస్ట్రీలో సరిగా నిలదొక్కుకోలేక పోయాడు.

డైరెక్టర్ సాగర్ కి మైండ్ దొబ్బింది…

రామసక్కనోడు, అమ్మ దొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సాగర్ సినిమాలో ఎంఎస్ గారు నటించినపుడు షూటింగ్ కి తాగి వస్తే కొట్టాను అంటూ సాగర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వాఖ్యలు చేసారు. ఇక వీటి ప్రస్తావన ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి విక్రమ్ వద్ద రాగా విక్రమ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదు. ఆయన మరణించిన ఇన్నేళ్లకు ఈ విషయంలో మాట్లాడటం ఏమిటి.

చనిపోయినవారు ఎలాగూ తిరిగి వచ్చి చెప్పలేరని ఇలాంటివి మాట్లాడుతారా, ఆయన ఇమేజ్ ముందు సాగర్ అనే డైరెక్టర్ ఎంతటి వాడు, అలా మాట్లాడకూడదు, ఈ మధ్య కాలంలో వయసు పెరిగి మైండ్ దొబ్బినట్లుంది. సాగర్ గారు కొడుతూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు ఎవరూ లేరు మా కుటుంబంలో. ఇలాంటి మాటలు మాట్లాడకండి లేనివి అంటూ విక్రమ్ ఫైర్ అయ్యారు.