Featured

Vinitha : ఈ నటిని గుర్తు పట్టారా.. ఆ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది చివరికి కటకటాల పాలయ్యింది..!

Vinitha : 1993లో చిన్న జమీన్ అనే తమిళ్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. అప్పటి నుండి వినీత ఇప్పటివరకు 70 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర భాషలలో అగ్ర కథానాయకుల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వినీత ఆమె నటించిన సమయంలో ఎక్కువగా గ్లామర్ రోల్ ఉన్న పాత్రలో నటించేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లో నటించిన తర్వాత కేవలం లేడీస్ డాక్టర్ అనే సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత మరెక్కడా కూడా ఈ నటి తెలుగులో కనపడలేదు. తర్వాత రోజుల్లో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో వినీత అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ జీవనాన్ని కొనసాగించేది. అయితే సినిమాల్లో వచ్చే ఆదాయం సరిపోక వినీత చెడు మార్గాలను ఎంచుకుంది. అందం ఉన్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుందో ఏమోగానీ ఆవిడ వ్యభిచారనికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికింది. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. వ్యభిచారం కేసులో 2002లో తమిళనాడు పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలుకు పంపించారు. ఈమెను విచారించిన పోలీసులు వ్యభిచారానికి సంబంధించిన ఒక పెద్ద ఆపరేషన్ చేసి పెద్ద ముఠా గుట్టు బయట పెట్టించింది. దీంతో తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

అయితే ఈవిడ కొంతమంది యువతులకు డబ్బు ఎర చూపి వారిని వ్యభిచార వృత్తిలోకి లాగేదని, అలా వారితో పని చేయించుకొని డబ్బులు కూడా ఇచ్చేది కాదని వినీత పై అనేక మంది ఫిర్యాదు కూడా చేశారు. 2004 వరకు ఈ కేసు నడిచిన ఆ తర్వాత కొంతమంది బడా ఆ వ్యక్తుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడి, ఆపై వినీత మానసిక స్థితి బాగా లేదని కోర్టులో కొత్త డ్రామా తో అప్లై చేసి 2004లో జైలు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి ఎనిమిదేళ్ల బారి విరామం తర్వాత 2008లో సహాయక క్యారెక్టర్ రోల్ లో నటించింది. ఆ తర్వాత రోజుల్లో వినీత తన అందాన్ని పూర్తిగా కోల్పోయి గుర్తు పట్టనంత లావుగా మారిపోయింది.

ప్రస్తుతం వినీతను చూసిన వారు ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు. ఏ అందమైతే తనకు గొప్ప వరం అనుకొని సినిమా పరిశ్రమలకు వెళ్ళిందో ఆ అందం ఇప్పుడు వినీత లో ఎక్కడా కనపడలేదు. ఇదివరకు ఉన్న అందాన్ని పూర్తిగా కోల్పోయి పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది. పక్కవాడిని మోసం చేసి సంపాదించిన సొమ్ము కావడంతో ఇప్పుడు వినీత అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఆమెను క్షమించలేము. కాబట్టి తప్పు దారిలో కాకుండా నిజాయితీగా సంపాదించిన వాటికే ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

22 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

22 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

22 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

23 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

23 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

23 hours ago