Featured

Kallu Chidhambharam : ఐ మిస్ యూ నాన్న… నాన్న కళ్ళ ఆపరేషన్ అందుకే చేయించుకోలేదు… ఎమోషనల్ అయిన కూతురు…!

Kallu chidhambharam : ఆయన కళ్ళతో హాస్యం పలికించే నటుడు. డిఫరెంట్ గా ఉండే కళ్ళు ఆయనకు పుట్టుకతో అలా వచ్చినవి కాదు, ఒకవైపు నాటకాలు వేస్తూ మరో వైపు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం చేస్తూ రెండింటిని మేనేజ్ చేస్తున్న సమయంలో నిద్ర లేకపోవడంతో కళ్ళు అలా మారాయట. అయితే ఆ కళ్ళే ఆయనకి సినిమాల్లో అవకాశాలను తెప్పించాయి. ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఇక ఆయన మరణించి ఇంత కాలం అయినా సినిమాల ద్వారా అందరినీ అలరిస్తున్న ఆయన గురించి అయన పిల్లలు తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మిస్ యూ నాన్న…

కళ్ళు చిదంబరం గారికి నలుగురు సంతానం కాగా అందులో ఇద్దరు కవల పిల్లలు. రామకృష్ణ, సులక్షణ గార్లు రెండు నిమిషాల తేడా తో పుట్టినవారు తమ తండ్రి నటించిన సినిమాల్లో హాస్యాన్ని ఇప్పటికీ అశ్వదిస్తున్నాం అంటూ చెప్పారు. ఆస్తులు సంపాదించడం కాదు గొప్ప పేరు సంపాదించుకోవడం ముఖ్యమని ఎప్పుడూ నాన్న చెప్పేవారంటూ వాళ్ళు పంచుకున్నారు. ఇక ఆయన కళ్ళకు ఆపరేషన్ చేస్తే సరిగా అయిపోతాయి అని తెలిసినా చిన్న సర్జరీ అని తెలిసినా ఆయన చేయించుకోలేదట. ఈ కళ్ళ వల్ల ఎంతో మంది నవ్వుతున్నపుడు అభిమానిస్తున్నపుడు ఎందుకు ఆపరేషన్ చేయించుకుని సరి చేసుకోవాలి అంటూ చెప్పేవారట.

సేవా భావం ఎక్కువగా ఉండేది నాన్న గారికి అంటూ చాలా త్వరగా ఆయన మా నుండి దూరం అయ్యారు ఇంకా మాతో ఉండుంటే బాగుండేది అంటూ కూతురు సులక్షణ ‘మిస్ యూ నాన్న’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన నటించిన అమ్మోరు సినిమాలో షూటింగ్ అయ్యాక మేకప్ తీసేయకుండా అలానే వచ్చేసరికి భయపడ్డామని కూతురు చెప్పారు. ఆ సినిమా నాన్న గారికి ‘కళ్ళు’ సినిమా తరువాత అంత మంచి పేరు తెచ్చిందని చెప్పారు. ఇక అమాయకంగా నటించి హాస్యం పండించిన ఆ ఒక్కటి అడక్కు, ఒట్టేసి చెబుతున్న వంటి సినిమాల్లో పాత్రలు బాగా నచ్చుతాయంటూ పేర్కొన్నారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

23 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

23 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

23 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago