Mahesh Babu : సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదలయింది. రెండేళ్ల తరువాత మహేష్ బాబు నుండి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు బాగా సందడి చేసారు. ఇక మొదటి రోజు సినిమా మిశ్రమ స్పందనతో ఆడినా కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. ఇక రెండో రోజు మాత్రం కలెక్షన్స్ కొంచెం తగ్గి పర్వాలేదనిపిస్తున్నాయి. సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ నటించింది. ఇక విలన్ గా సముద్రఖని అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో సినిమాను బాగా రన్ చేసాడు దర్శకుడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఎమోషన్స్, యాక్షన్స్ సీన్స్ తో అన్ని కలిపి సినిమా ఓవరాల్ గా బాగుంది అనే స్పందన వచ్చింది. ఇక సినిమాపై పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
సినిమా రన్ టైం 2గంటల 40 నిమిషాల కాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లు జరిగింది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు పోగా వెస్ట్ 7 కోట్లకు, ఈస్ట్ 8.50 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 96.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటకలో 8.50 కోట్ల ముందస్తు బిజినెస్ జరగగా, మిగిలిన ఇండియా 3 కోట్లకు, ఇక ఓవర్సీస్ లో మహేష్ డిమాండ్ కారణంగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో రెండో రోజే 1 మిలియన్ గ్రాస్ ను వసూలు చేసేసింది అని చిత్ర వర్గాలు పోస్టర్ విడుదల చేసారు. దీంతో బ్రేక్ ఈవెన్ రెండో రోజే పూర్తి చేసుకుంటుంది అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. ఓవర్సీస్ లో 100 కోట్లు వసూలు చేసిన సినిమా మహేష్ వి ఆల్రెడీ 11 ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…