చిప్స్ ప్యాకెట్ కొన్నాడు.. తెరిచి చూసే సరికి షాక్ అయ్యాడు..!

అప్పుడప్పుడు కొంతమందికి ఈ కామర్స్ వెబ్ సైట్లో బుక్ చేసిన ఐటెం కాకుండా వేరు ఐటం రావడం.. మరో సందర్భంలో అదే ఐటంను తెరిచి చూసినప్పుడు మనం ఊహించినవి ఉండటం అనేవి మనం చూస్తూ వస్తున్నాం.

ఇలాంటిదే ఒకటి బ్రిటన్ లో ఓ వ్యక్తికి ఎదురయ్యింది. అతడు ఒక గంట నుంచి ఆకటి అవుతుంది. ఏం చేయాలో అర్థం గాక.. పక్కనే ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లి ఓ చిప్స్ ప్యాకెట్ ను కొన్నాడు. ఆత్రుతగా తెరిచి చూసే సరికి అతడు షాక్ అయ్యాడు. అందులో చిప్స్ కాకుండా ఆలుగడ్డ ఉంది.

దీంతో అతడి ఆకలి కాస్త ఆవిరైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. లండన్ లోని లింకన్‌షైర్‌లోని ఉప్పింగ్‌హామ్ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడైన డేవిడ్ బాయ్స్ కు ఇటీవల పాఠశాల టైమింగ్స్ అయినపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు చిప్స్ ప్యాకెట్ కొనగా.. అందులో బంగాళదుంప ఉంటటం చూసి షాక్ అయ్యాడు.

దుకాణాదారుడిని అడగ్గా.. తనకు సంబంధం లేదు.. అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు దానిని ఫొటో తీసి ట్విట్టర్‌ ద్వారా ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సదరు సంస్థ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందో తెలియడం లేదని.. మున్ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దానిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు.