వైరల్ వీడియో: మక్కా మసీదులోకి దూసుకెళ్లిన కారు!

ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని మక్కా మసీదులోకి ఒక కారు దూసుకు వెళ్ళిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఎంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మసీదు లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 10:25 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు.

ఎంత వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మసీదు బయట వైపు ప్రాంగణంలో నిర్మించిన భారీ గేట్లను ఢీ కొట్టుకొని వెళ్ళింది. ఈ విషయం గమనించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ ప్రాణాలను రక్షించారు. అయితే ఆ డ్రైవర్ ఎవరు, అతని పేరు ఏమిటి అన్న విషయాలను గురించి అధికారులు తెలియజేయలేదు. కానీ ఆ డ్రైవర్ సౌదీ అరేబియా పౌరుడు అని మాత్రం అధికారులు తెలియజేశారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సౌదీఅరేబియాలోని ఎంతో పవిత్రమైన మక్కా మసీదు కూడా మూత పడింది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు అనంతరం ఏడు నెలల తర్వాత తెరుచుకున్న మక్కామసీదు ప్రస్తుతం భక్తుల సందర్శనార్థం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ15 వేలమంది సందర్శనార్థం భక్తులకు అవకాశం కల్పించారు. ఈ కారు ప్రమాదం జరిగినప్పుడు బయట భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేశారు.

కారు అంత వేగంగా రావడానికి గల కారణం డ్రైవర్ మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ లలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ అక్కడ ఎవరు భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.