Manchu Lakshmi : నెవర్ హ్యవ్ ద రైట్ షూ… “స్మగ్లర్” అంటూ ట్రోల్ల్స్ చేస్తున్న నేటిజన్స్..!

Manchu Lakshmi : మంచు వారసురాలిగా మనోజ్, విష్ణులతో పాటు తనదైన స్టైల్ తో తెలుగు సినీ పరిశ్రమలో రానిస్తోంది. నటిగానే కాకుండా టీవీ ప్రోగ్రాములతోటి కూడా అభిమానులను అలరించింది. అయితే చాలా కాలంగా కాస్త నటనకు దూరంగా ఉందనే చెప్పాలి. ప్రస్థుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎపుడు ఏవో ఒక పోస్టులు చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది. కానీ లక్ష్మి పెట్టే పోస్టులకు ప్రశంసించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఎక్కువగానే వుంటారు. తాజాగా లక్ష్మి పెట్టిన ఒక పోస్ట్ కు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

షో ఆఫ్ చేస్తున్నావ్….

తాజాగా మంచు లక్ష్మి చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  ఈ ఫోటోలో  మంచు లక్ష్మ తన ఇంట్లో ఉన్న షూ రాక్ ముందు కూర్చొంది. తన ముందు  కొన్ని జతల షూస్ వేసుకొంది. దానికి ఆమె నెవర్ హ్యావ్ ద రైట్ షూ అని క్యాప్షన్ కూడా పెట్టింది. అంటే నాకు సరైన షూ ఎప్పటికీ లేదు అంటూ పోస్టు చేసింది. ఇక ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్స్ వారికి తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై స్పందించిన ఓ నెటిజన్ కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట అంటూ కామెంట్ చేశాడు. ఇంకొకరు లెక్క లేనన్ని జోల్లు ఒక చోటు అంటూ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ కొత్త షాపు ఓపెన్ చేశారా…కాంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశాడు. మంచు లక్ష్మీ షో ఆఫ్ చేస్తుందని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ అయితే ‘నీకు భగవంతుడు ఇన్ని రకాల షూస్ ఇచ్చాడు. నువ్వు వాడనప్పుడు వాటిని ఓ జత కూడా చెప్పులు లేని నిరు పేదలకు ఇవ్వొచ్చు కదా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా నెటిజన్లు తమదైనా రీతిలో స్పందించారు.