Manchu Manoj: భూమా మౌనిక రెడ్డి నటుడు మంచు మనోజ్ తో కలిసి ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి రెండో పెళ్లి కావడం విశేషం. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. మౌనిక పెళ్లి తర్వాత బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టగా మనోజ్ మాత్రం తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మనోజ్ బిజినెస్ గురించి తాజాగా ఒక వార్తను అభిమానులతో పంచుకున్నారు.
ఇటీవల మౌనిక తల్లి కాబోతుంది అంటూ ఒక విషయాన్ని అభిమానులతో పంచుకున్నటువంటి ఈయన తాజాగా మౌనిక కొత్త బిజినెస్ ప్రారంభించింది అంటూ కూడా తెలియజేశారు. గత నాలుగున్నర సంవత్సర కాలం పాటు వీరు ఈ బిజినెస్ ప్రారంభించారని మనోజ్ తెలిపారు.
తమ ఇంటిని ఆఫీసుగా మార్చుకొని కరోనా సమయంలో బొమ్మలు గీయడం వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడం వంటివి చేస్తామని మనోజ్ తెలిపారు. ఇలా తాము టాయ్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టామని ఈ టాయ్స్ జియో వరల్డ్ రిలయన్స్ సంస్థలతో కలిపి పలు స్టోర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చామని మనోజ్ వెల్లడించారు.
దైరవ్ వల్లే ఈ ఆలోచన…
కరోనా సమయంలో వివిధ రకాల బొమ్మలను గీస్తూ పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉండేలా ఈ బొమ్మలను ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసామని ఈ బొమ్మలు పూర్తిగా మెడ్ ఇన్ ఇండియా టాయ్స్ అంటూ మనోజ్ వెల్లడించారు. అయితే తాము ఈ బిజినెస్ ప్రారంభించాలని ఐడియా మా కొడుకు ద్వారానే వచ్చింది అంటూ వారు ప్రారంభించిన కొత్త బిజినెస్ గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…