Manchu Manoj: మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని ఈ ఏడాది మార్చి నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. ఇకపోతే భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ కూడా కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయన ఇప్పుడు కెరియర్ పై ఫోకస్ పెడుతున్నారు.
ఇలా ఒకవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు పలు టీవీ షోలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ఉస్తాద్ అనే టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమానికి మనోజ్ వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు .ఇక ఈ కార్యక్రమం డిసెంబర్ 15వ తేదీ ప్రారంభం కానున్న నేపథ్యంలో లాంచింగ్ ఈవెంట్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను ఏడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అయితే మౌనిక రెడ్డితో ఏడడుగులు వేసిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలియజేశారు. ఇలా ఏడేళ్లు ఇండస్ట్రీకి దూరమైన అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తెలిపారు.
ప్రేమ విలువ అప్పుడే తెలిసింది…
ఇక తాను భూమ మౌనికతో ప్రేమలో పడిన తర్వాత ప్రేమ అంటే ఏంటో అప్పుడే తెలిసిందని, ఈ సందర్భంగా భూమా మౌనికను అలాగే తన అభిమానులు తన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను ఉద్దేశించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .తన గురించి మనోజ్ అలా మాట్లాడటంతో మౌనిక కూడా ఎమోషనల్ అయ్యారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…