అమర జవాన్ సాయి తేజ కుటుంబానికి అండగా.. మా అధ్యక్షుడు విష్ణు!

తాజాగా జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామానికి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సాయి తేజ తెలుగు వారని తెలియడంతో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా సాయి తేజ భార్య శ్యామలతో ఫోన్ లో మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.

అలాగే వారి పిల్లలను ఇంజనీరింగ్ చదువు చెప్పించే బాధ్యత తనది అని తెలిపారు. జవాన్ సాయి తేజకు 5 ఏళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. అయితే పిల్లల చదువు కోసం తన కుటుంబ స్వగ్రామం నుంచి మదనపల్లికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో మంచు విష్ణు కుటుంబానికి విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ విద్యా సంస్థల బాధ్యతలను విష్ణు చూసుకుంటుండటం వల్ల, సాయి తేజ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం సాయి తేజ భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని అందరూ అండగా ఉంటామని ఓదార్చారు.

2013లో ఆర్మీలో చేరిన సాయి తేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా పని చేస్తున్నారు. సాయి తేజ మరణంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. సాయి తేజ చివరిసారిగా వినాయకచవితి పండుగ సమయంలో ఇంటికి వచ్చారని, అలాగే తన భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్ లో మాట్లాడి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని, అనంతరం సిగ్నల్ సరిగా లేకపోవడంతో కాల్ కట్ అయిందని, కాల్ మాట్లాడి కట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు అంటూ ఆయన సతీమణి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది.